Puneeth Rajkumar: పునీత్‌రాజ్ కుమార్ మరణం తట్టుకోలేక అభిమానుల ఆత్మహత్యాయత్నం

పాతికేళ్లకు స్టార్ అయ్యాడు.. ఇరవై ఏళ్లలో ముఫ్ఫై సినిమాలు చేశాడు. సగానికి పైగా సూపర్‌ హిట్లు. వందల కోట్ల వ్యాపారం..

10TV Telugu News

Puneeth Rajkumar: పాతికేళ్లకు స్టార్ అయ్యాడు.. ఇరవై ఏళ్లలో ముఫ్ఫై సినిమాలు చేశాడు. సగానికి పైగా సూపర్‌ హిట్లు. వందల కోట్ల వ్యాపారం.. సూపర్‌స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, పవర్ స్టార్‌గా మారి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గుండె చప్పుడు ఆగింది. కోట్లాది మంది అభిమానుల్ని కన్నీటి సంద్రంలో నెట్టేశారు పునీత్ రాజ్‌కుమార్.

పునీత్‌రాజ్ కుమార్ అంత్యక్రియలు కంఠీరవ స్టేడియంలో జరగనున్నాయి. రాత్రంతా వేలాదిగా తరలివస్తూనే ఉన్నారు. ‘అప్పు.. అప్పు..’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు తరలివస్తున్నారు. కొందరు అభిమానులు ప్రిన్స్ పునీత్ హఠాన్మరణంతో అభిమానులు ఆత్మహత్యాయత్నం చేశారు.

సింధనూరు తాలూకా హరపురా గ్రామానికి చెందిన బసనగౌడ(22), సాలిగ్రామానికి చెందిన రిక్షా డ్రైవర్ సతీష్ (35), యాపలపరవి గ్రామానికి చెందిన మహ్మద్ రఫీ(25) విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇద్దరిని సింధనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు కంఠీరవ స్టేడియంలో అభిమానుల మధ్య జరగనున్నాయి. అభిమానులు వేలాదిగా అంత్యక్రియల కార్యక్రమానికి తరలివస్తున్నారు.

 

×