Keshava Character: పుష్పలో కేశవ క్యారెక్టర్‌ కోసం అడిగారు.. కానీ, మిస్ అయ్యింది!

యూట్యూబ్‌లో పాపులర్ అయ్యి.. తర్వాత సినిమా రంగంలో కమెడీయన్‌గా రాణిస్తూ.. బిగ్‌ బాస్‌తో క్రేజ్ తెచ్చుకున్న నటుడు మహేష్ విట్టా

Keshava Character: పుష్పలో కేశవ క్యారెక్టర్‌ కోసం అడిగారు.. కానీ, మిస్ అయ్యింది!

Keshava

Keshava Character: యూట్యూబ్‌లో పాపులర్ అయ్యి.. తర్వాత సినిమా రంగంలో కమెడీయన్‌గా రాణిస్తూ.. బిగ్‌ బాస్‌తో క్రేజ్ తెచ్చుకున్న నటుడు మహేష్ విట్టాకు సూపర్ హిట్ పుష్ప సినిమాలో కీలకమైన రోల్‌ని మిస్ చేసుకున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయ్యి సూపర్ క్రేజ్ దక్కించుకున్న పుష్ప సినిమాలో కేశవ పాత్ర ఎంత కీలకమో సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థం అవుతుంది.

సినిమాలో ఫుల్‌ లెంగ్త్ రోల్ అయిన పుష్ప ఫ్రెండ్ కేశవ క్యారెక్టర్ కోసం ఫస్ట్ మహేష్ విట్టానే ఎంచుకున్నారంట చిత్రయూనిట్. ఈ విషయాన్ని మహేష్ విట్టానే స్వయంగా వెల్లడించారు. పుష్పరాజ్ స్నేహితుడైన కేశవ పాత్రను జగదీష్ ప్రతాప్ భండారీ అనే నటుడు చేశాడు. ఈ పాత్ర సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే.

ఈ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతూ.. కాస్త ఫన్నీగా.. కాస్త సెంటిమెంటల్‌గా అన్నీ యాంగిల్ యాక్షన్‌లు వర్క్‌ఔట్ అయ్యే పాత్ర.. ఈ పాత్రను చిత్తూరు యాసలో మాట్లాడే మహేష్ విట్టాను పెట్టాలని సుకుమార్ ప్రయత్నించారు.

“కేశవ పాత్ర కోసం సుకుమార్ సర్ నన్ను పిలిపించారు. క్యారెక్టర్ గురించి చెప్పి కథను నేరేట్ చేశారు. కథ విన్నప్పుడే చాలా మంచి పాత్ర అనిపించింది. కానీ, ఈ ఒక్క సినిమా కోసం రెండేళ్ల సమయాన్ని కేటాయించలేను అనుకుని, ఆ స్థానంలో వేరే వ్యక్తిని సెలక్ట్ చేసుకున్నారు.” అని చెప్పారు మహేష్ విట్టా.