రాగల 24 గంటల్లో- రివ్యూ

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ.. ‘రాగల 24 గంటల్లో’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : November 22, 2019 / 11:23 AM IST
రాగల 24 గంటల్లో- రివ్యూ

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ.. ‘రాగల 24 గంటల్లో’ రివ్యూ..

శ్రీనివాసరెడ్డి చాలా కష్టపడి టాలెంట్‌తో పైకి వచ్చిన డైరెక్టర్ అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కానీ ఆయన తీసిన ‘ఢమరుకం’ అనే ఒక ఒక్క సినిమా ఫలితం అతని కెరీర్‌నే మార్చేసింది. అంతకు ముందు అనేక హిట్స్ ఇచ్చినా కూడా చాలా కాలం సినిమా చెయ్యలేని సిట్యుయేషన్ ఏర్పడింది. కానీ మళ్ళీ పట్టుదలగా కంటెంట్‌ని నమ్ముకుని ‘రాగాల 24 గంటల్లో’ అనే సినిమా తీశాడు. సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్‌లో కనిపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో కనిపించాయా, లేదా అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ విషయానికి వస్తే :
రాహుల్ ఇండియాలోనే ఫేమస్‌ యాడ్‌ ఫిలిం మేకర్‌. అనాథ అయిన విద్యను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రాహుల్‌. అయితే పెళ్లి తరువాత రాహుల్ తన ప్రవర్తనతో విద్యను ఇబ్బంది పెడుతుంటాడు. దీంతో వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుంటాయి. ఒక రోజు రాహుల్‌ హత్యకు గురవుతాడు. తన కోసం తన ఫ్రెండ్‌ గణేష్‌, రాహుల్‌ని చంపేసి ఉంటాడన్న అనుమానంతో హత్యానేరం తన మీద వేసుకుంటుంది విద్య. కానీ గణేష్‌ కూడా ఈ హత్య చేయలేదని తెలియటంతో ఇద్దరూ షాక్‌ అవుతారు. మరి రాహుల్‌ను హత్య చేసింది ఎవరు..? ఈ హత్య మిస్టరీ ఎలా వీడింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల విషయానికి వస్తే : 
ఈషా రెబ్బా పొటెన్షియల్ ఉన్న నటి అని మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. కానీ ఆమెకి సరైన బ్రేక్ ఇచ్చే క్యారెక్టర్ ఏదీ కూడా ఇంతవరకు పడలేదు. అయితే ఈ సినిమాలో కూడా తన మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది ఈషా రెబ్బా. సినిమా అంతటినీ తన భుజాలపై మోసింది. సత్యేదేవ్ నటన సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన శ్రీకాంత్‌ (ఆడవారిమాటలకు అర్థాలేవేరులే) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీకాంత్ నటన తేలిపోయింది. మేఘన పాత్రలో ముస్కాన్‌ సేథి ఆకట్టుకుంది. ఇతర నటటులు తమ పరిధిమేర నటించారు.. 

టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే :
ఎక్కువగా కామెడీ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీనివాస్‌ రెడ్డి థ్రిల్లర్ సినిమాను డీల్‌ చేయటంలోనూ పరవాలేదనిపించాడు. సినిమా తొలి సన్నివేశంలోనే విద్య తానే తన భర్తను చంపేశానని చెప్పటంతో తరువాత జరిగే సన్నివేశాలు పెద్దగా ఆసక్తిగా అనిపించవు. సెంకండాఫ్ నుంచి ఇంట్రెస్ట్ పెంచాడు డైరెక్టర్.. ఒక ఇంట్లోనే సినిమా చాలా వరకు తీసినా.. సినిమాటో గ్రాఫర్  బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు. పాటలు మెప్పించకున్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటేబాగుండేది.. నిర్మాణ విలువలు బాగున్నాయి… 

ఓవరాల్ గా చెప్పాలంటే :
రాగల 24 గంటలలో ఏం జరగబోతుంది అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుంది అనేది వేచి చూడాలి.