Raghava Lawrence : నువ్వు దేవుడివి సామి.. ఇంకో 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న లారెన్స్..

ప్రస్తుతం రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాతో రాబోతున్నాడు. రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్ జంటగా తెరకెక్కిన రుద్రుడు సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.

Raghava Lawrence : నువ్వు దేవుడివి సామి.. ఇంకో 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న లారెన్స్..

Raghava Lawrence adopts one more 150 orphan children

Raghava Lawrence :  కొరియోగ్రాఫర్(Choreographer) గా, యాక్టర్(Actor) గా, డైరెక్టర్(Director) గా ఇప్పటికే ఎన్నో సినిమాలతో అలరించాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో పేరు, ప్రతిష్ట, డబ్బులు సంపాదించి వాటిని మంచి పనులకు ఉపయోగిస్తున్నారు లారెన్స్(Lawrence). ఎన్నాళ్ళ నుంచో లారెన్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లలను దత్తత(Adopt) తీసుకొని వారి చదువుకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నారు, ఓ అనాధాశ్రమాన్ని(Orphanage) కూడా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాతో రాబోతున్నాడు. రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్ జంటగా తెరకెక్కిన రుద్రుడు సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా రుద్రుడు ప్రమోషన్స్ లో భాగంగా లారెన్స్ మరో మంచి విషయాన్ని ప్రకటించాడు.

Simhadri : డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ‘సింహాద్రి’ రీ రిలీజ్ చేస్తున్న అభిమానులు.. వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తారో తెలుసా?

కొంతమంది అనాథ పిల్లలను రుద్రుడు ప్రమోషన్స్ స్టేజిపైకి తీసుకొచ్చి వారితో ఫోటోని దిగాడు.ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మరో 150 మంది పిల్లలను దత్తత తీసుకొని వారికి, వారి చదువుకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నాను. రుద్రుడు వేదికపై నుంచి ఈ విషయాన్ని మీ అందరికి తెలియచేయడం ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి అని పోస్ట్ చేశారు. దీంతో మరోసారి అందరూ లారెన్స్ ని అభినందిస్తున్నారు.