Simhadri : డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ‘సింహాద్రి’ రీ రిలీజ్ చేస్తున్న అభిమానులు.. వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తారో తెలుసా?

ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా మళ్ళీ రీ రిలీజ్(Re Release) కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నారు.

Simhadri : డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ‘సింహాద్రి’ రీ రిలీజ్ చేస్తున్న అభిమానులు.. వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తారో తెలుసా?

Simhadri Re Release on NTR Birthday by Fans

Simhadri : ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమాన హీరో సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, కలెక్షన్స్ వస్తుండటం, థియేటర్స్ లో మంచి స్పందన లభిస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బాద్ షా, అదుర్స్ సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) కెరీర్ లో మొదటి భారీ హిట్, ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమా సింహాద్రి(Simhadri)ని రీ రిలీజ్ చేయబోతున్నారు.

Sreeleela : ఇక అఫీషియల్.. పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల.. శరవేగంగా ఉస్తాద్ షూట్..

రాజమౌళి(Rajamouli) – ఎన్టీఆర్ కాంబోలో ఎన్టీఆర్ 7వ సినిమాగా వచ్చిన సింహాద్రి భారీ విజయం సాధించింది. 8 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తే ఏకంగా 25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది రాజమౌళి – ఎన్టీఆర్ కాంబోలో రెండో సినిమా. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా మళ్ళీ రీ రిలీజ్(Re Release) కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నారు.

Image

తాజాగా ఈ రీ రిలీజ్ పై ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఓ స్పెషల్ నోట్ ని రిలీజ్ చేశాయి. ఈ నోట్ లో.. సింహాద్రి సినిమాని ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా మే 20న విడుదల చేస్తున్నాము. అయితే సినిమాని డిస్ట్రిబ్యూటర్స్, వేరే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఒక థర్డ్ పార్టీ వద్ద మేమే ఒక ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నాము. ఈ రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ తిరిగి అభిమానులకే చేరాలని మేమే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు, అభిమాన సంఘాలు, స్టేట్ కన్వీనర్లు మాట్లాడుకొని ఈ నిర్ణయానికి వచ్చాము. అన్ని జిల్లాల్లో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. దీంతో రీ రిలీజ్ కి వచ్చిన కలెక్షన్స్ ని ఆ జిల్లాల్లో కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు అందచేయడం జరుగుతుంది. ఇదే మాట ఎన్టీఆర్ గారికి కూడా చెప్పాము. ఆయన కూడా మంచి ఉద్దేశం అని ఓకే అన్నారు. ఇందులో మాకు ఎలాంటి స్వలాభం లేదు. కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల కోసమే ఈ పనిచేస్తున్నాము అని తెలిపారు.