Raj Tarun: “పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు” అయ్యిందంటూ ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్..

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, సినీ రంగంలో మంచి అవకాశాలని అందిపుచ్చుకున్న హీరో "రాజ్ తరుణ్". కెరీర్ మొదటిలో వరుస హిట్లు అందించిన ఈ యువహీరో.. ఇప్పుడు ఒక్క హిట్టు అందుకోడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో బైట్‌ కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

Raj Tarun: “పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు” అయ్యిందంటూ ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్..

Raj Tarun Emotional video on his Marriage

Raj Tarun: షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, సినీ రంగంలో మంచి అవకాశాలని అందిపుచ్చుకున్న హీరో “రాజ్ తరుణ్”. కెరీర్ మొదటిలో వరుస హిట్లు అందించిన ఈ యువహీరో.. ఇప్పుడు ఒక్క హిట్టు అందుకోడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో బైట్‌ కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

Raj Tarun: వరసగా డజను ప్లాపులు.. డైలమాలో రాజ్ తరుణ్ భవిష్యత్!

ఆ వీడియోలో రాజ్ మాట్లాడుతూ.. “ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఒక కారణం ఉందండీ. నా జీవితంలో ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటది అనుకోలా, చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడుతుంటే నేను అమ్మ చెప్పిన కొత్తిమీర, కరివేపాకు తెచ్చేవాడిని. అలాంటి నాకు నా పేరెంట్స్ ఒక పెళ్లి నిశయించి, ముహూర్తం కూడా పెట్టారు.

అంతా ఆనందంగా జరుగుతుంది అనుకున్న సమయంలో.. పెళ్లికూతురు లెటర్ రాసి ఎవరితోనో లేచిపోయింది. నా కుటుంబానికి ఉన్న పరువు మొత్తం తీసేసింది. కాబట్టి ఆ అమ్మాయిని వదిలేది లేదు, ఆమె ఫోటో రేపు షేర్ చేస్తాను, ఎక్కడైనా కనబడితే చెప్పండి” అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకి ఇకలేదు అనే హాష్ టాగ్ ని జతచేశాడు. దీంతో ఇది తన కొత్త సినిమా ప్రమోషన్ అని తెలుస్తుంది. ఈ ఏడాది మొదటిలో ‘స్టాండ్ అప్ రాహుల్‌’ వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Raj Tarun (@rajtarunn)