Raj Tarun: వరసగా డజను ప్లాపులు.. డైలమాలో రాజ్ తరుణ్ భవిష్యత్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే, రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం చాలా దారుణంగా తయారయిందని చెప్పాలి. అతడు చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది.

Raj Tarun: వరసగా డజను ప్లాపులు.. డైలమాలో రాజ్ తరుణ్ భవిష్యత్!

Raj Tarun: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే, రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం చాలా దారుణంగా తయారయిందని చెప్పాలి. అతడు చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది. కెరీర్ తొలినాళ్లలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యమిచ్చిన ఈ యంగ్ హీరో వాటిని సూపర్ హిట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Raj Tarun : ‘స్టాండ‌ప్ రాహుల్‌.. కూర్చుంది చాలు’..

ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో రాజ్ తరుణ్ ఖాతాలో మరో హిట్ చేరింది. రాజ్ తరుణ్ నటించిన కుమారి 21ఎఫ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఒకే తరహా చిత్రాల ఎంపికతో తన కెరీర్‌ను తానే పతనంవైపు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఎలాంటి సినిమాను ఎంచుకుని చేసినా, అది ఆడియెన్స్‌కు కనెక్ట్ కావడంలో పూర్తిగా ఫెయిల్ అవుతూ వస్తోంది. కెరీర్ ఆరంభంలో చేసిన మూడు సినిమాల సక్సెస్ తర్వాత డజనుకు పైగా సినిమాలు వరసగా ఫ్లాపులుగా మిగిలాయి.

Anubhavinchu Raja Teaser : బంగారం గాడు ఊర్లోని.. ఆడి పుంజు బరిలోని ఉండగా ఇంకోడు గెలవడం కష్టమెహే..!

చివరగా రాజ్ నుంచి వచ్చిన ‘స్టాండప్ రాహుల్’ ఏమాత్రం ప్రభావం చూపించలేక బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోయింది. మరి కెరీర్ తొలినాళ్లలో ఎంతో ఆశాజనకంగా కనిపించిన రాజ్ కెరీర్ ఇలా తయారవ్వడానికి కారణమేంటి? దీని గురించే అతడి మేనేజర్, సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆరంభంలో విజయాల తర్వాత వచ్చిన ఇబ్బడిముబ్బడి అవకాశాలను.. ఆలోచన లేకుండా ఒప్పుకుని సినిమాలు చేసుకుంటూ పోయాడని.. ఏ సినిమా వర్కవుట్ అవుతుంది, ఏది కాదు అని జడ్జిమెంట్ చూసుకోలేదని రాజా రవీంద్ర చెప్పాడు.

Raj Tharun: ఆడియెన్స్‌ను సీట్లలో కూర్చోబెట్టలేకపోయిన స్టాండప్ రాహుల్

నమ్మకంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తే హిట్లు వాటంతట అవే వస్తాయని.. ఒకటి పోయినా ఇంకోటి ఆడుతుందన్న ధీమాతో ముందుకు వెళ్లిపోయామని రాజా రవీంద్ర చెప్పాడు. కొన్ని సినిమాలు తనకు నచ్చకుండా రాజ్ చేశాడని.. అలాగే కొన్ని రాజ్‌కు నచ్చకుండా తాను ఓకే చేశానని.. ఇలా ఇద్దరం పొరబాట్లు చేశామని చెప్పాడు. రాజ్ డేట్స్ కుదరక వదులుకున్న కొన్ని సినిమాలు భారీ హిట్స్ అయితే.. మరికొన్ని అట్టర్ ఫ్లాప్ కూడా అయ్యాయని.. ఇప్పుడు మాత్రం ఆచి తూచి కథల ఎంపిక చేస్తున్నామని.. దిల్ రాజు బ్యానర్ తో పాటు మరో మూడు సినిమాలు మొదలు కాబోతున్నాయని చెప్పాడు. మరి ఈ సినిమాలైనా రాజ్ తరుణ్ కెరీర్ ను గాడిన పెడతాయా అన్నది చూడాలి.