‘RRR’ తర్వాత ‘RR’..

‘RRR’ తర్వాత రామ్, రాజమౌళి కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి..

  • Published By: sekhar ,Published On : March 19, 2020 / 03:43 PM IST
‘RRR’ తర్వాత ‘RR’..

‘RRR’ తర్వాత రామ్, రాజమౌళి కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి..

‘RRR’ సినిమాతో బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేయనున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ తో సాలిడ్ హిట్ కొట్టాడు రామ్. ఈ చిత్రం పూరి, రామ్ ఇద్దరికీ బెస్ట్ హిట్‌గా నిలిచింది ‘ఇస్మార్ట్ శంకర్’..

త్వరలో మాస్ థ్రిల్లర్ ‘రెడ్’ తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు రామ్. తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘తడమ్’ తెలుగు రీమేక్ ఇది. తాజాగా జక్కన్న చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రామ్.. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాల తర్వాత ఓ మీడియం బడ్జెట్ మూవీ చేయాలనుకుంటున్నాడ రాజమౌళి. ఇంతకుముందు ‘మగధీర’ తర్వాత ‘మర్యాద రామన్న’ చేసిన సంగతి తెలిసిందే.

జక్కన్న ఫాదర్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ మీడియం బడ్జెట్ కథను సిద్ధం చేస్తున్నారట. ఇందులో రామ్ హీరోగా నటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో స్వాతంత్ర్య నేపథ్యంలో రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ 2020 జనవరి 8న విడుదలకు సిద్ధమవుతోంది.