ఆర్ఆర్ఆర్: “RRR”తో మరోమారు ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న రాజమౌళి..

దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది.హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ సాంకేతిక నిపుణులు వెండితెరపై జక్కన చేసిన మ్యాజిక్ కి ఫిదా అయ్యిపోతున్నారు. తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది.

ఆర్ఆర్ఆర్: “RRR”తో మరోమారు ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న రాజమౌళి..

ఆర్ఆర్ఆర్: దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది.హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ సాంకేతిక నిపుణులు వెండితెరపై జక్కన చేసిన మ్యాజిక్ కి ఫిదా అయ్యిపోతున్నారు. తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది.

IFFI 2022 : ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్న అఖండ, RRR, మేజర్..

అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక 50వ సాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మరియు బెస్ట్ డైరెక్టర్‌తో సహా పలు విభాగాల్లో నామినేట్ కాగా.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. అవార్డుని అందుకోవడానికి మూవీ టీం వెళ్లలేకపోవడంతో..రాజమౌళి ఒక వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ స్పెషల్ AV ని అవార్డు పురస్కారాల్లో ప్లే చేశారు. ఈ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ.. “RRR ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో సాటర్న్ అవార్డును గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా మొత్తం టీమ్ తరపున నేను జ్యూరీకి ధన్యవాదాలు చెబుతున్నా. ఇది నాకు రెండవ సాటర్న్ అవార్డు, బాహుబలి: ది కన్‌క్లూజన్ కూడా నేను అవార్డుని అందుకున్నా. జపాన్‌లో RRR ప్రమోషన్స్ వాళ్ళ మేము అక్కడ ఉండలేకపోతున్నాము. మిగతా విజేతలకు కూడా న అభినందనలు” అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ వీడియోని సాటర్న్ అవార్డ్స్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయగా.. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రాజమౌళిని అభినందిస్తూ రీ ట్వీట్ చేశాడు.