Rakhi Sawant : వ్యాలెంటైన్స్ డే రోజే విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్

నిన్న వ్యాలెంటైన్స్ డే రోజు ప్రపంచమంతా ప్రేమను పంచుకుంటుంటే రాఖీ మాత్రం విడాకులని అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చింది. హీరోయిన్ గా, ఐటెం భామగా, డ్యాన్సర్ గా రాఖీ సావంత్ బాగా......

Rakhi Sawant : వ్యాలెంటైన్స్ డే రోజే విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్

Rakhi Sawant

Rakhi Sawant :  ఇటీవల సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపొయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ .. ఇలా అన్ని పరిశ్రమలలోను చాలా మంద్రి సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల ఈ విడాకులు మరీ ఎక్కువయ్యాయి. అమీర్ ఖాన్ – కిరణ్ రావు, నాగ చైతన్య – సమంత, ధనుష్ – ఐశ్వర్య.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఇదే బాటలో మరో బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ విడాకులు తీసుకుంది.

నిన్న వ్యాలెంటైన్స్ డే రోజు ప్రపంచమంతా ప్రేమను పంచుకుంటుంటే రాఖీ మాత్రం విడాకులని అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చింది. హీరోయిన్ గా, ఐటెం భామగా, డ్యాన్సర్ గా రాఖీ సావంత్ బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ 14లో కంటెస్టెంట్ గా చేసి ఫైనలిస్ట్ గా నిలిచింది. తాజాగా రాఖీ సావంత్‌ తన భర్త రితేష్‌ సింగ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది.

ఈ పోస్ట్ లో.. ”రితేష్‌, నేను విడిపోవాలని నిశ్చయించుకున్నాం. బిగ్‌బాస్‌ షో తర్వాత నాకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయి. వాటిలో కొన్నింటిని నేను నియంత్రించలేకపోయాను. మా మధ్య ఉన్న మనస్పర్థలను, గొడవలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం కానీ చివరకి ఇద్దరం విడిపోయి ముందుకి వెళితేనే మంచిదని భావించాం. వాలంటైన్స్‌డేకు ఒకరోజు ముందే ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. హృదయం ముక్కలైనట్లుగా అనిపిస్తోంది.

Ram Charan : రాజమండ్రిలో రామ్ చరణ్.. RC 15 షూటింగ్..

విడాకుల తర్వాత రితేష్‌ మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాను. నేను నా జీవితంపై, కెరీర్‌పై ఫోకస్‌ చేయాలనుకుంటున్నాను. ఎల్లప్పుడూ నన్ను నేను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. మా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడే ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు” అని రాఖీ సావంత్‌ తెలిపింది.