Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..

రాఖీ సావంత్ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో ఉండాలంటే స్కిన్‌ షో తప్పదు. సల్వార్‌ డ్రెస్‌తో కెరీర్‌ మొదలుపెట్టినా తర్వాత బికినీ వేసుకోక తప్పదు. నా లాగా ఇండస్ట్రీలో................

Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..

Rakhi Sawanth

Rakhi Sawant :  బాలీవుడ్ డ్యాన్సర్, నటి రాఖీ సావంత్‌ డ్యాన్సర్ గా, నటిగా పాపులారిటీ తెచ్చుకుంది. హిందీ బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో, బయట రాఖీ సావంత్ బాగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఉంటుంది. గతంలో రితేష్ అని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే అతనికి అంతకుముందే పెళ్లి అయి పిల్లలు ఉన్నారని తెలిసి విడాకులు ఇచ్చేసింది రాఖీ. ప్రస్తుతం వ్యాపారవేత్త అదిల్‌ దురానీతో ప్రేమలో ఉంది.

అదిల్ కూడా రాఖీతో గాఢంగా ప్రేమలో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశారు. ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. పెళ్ళికి ముందే రాఖీ సావంత్ కోసం ఖరీదైన కారు, బంగ్లా కొనిచ్చాడు. అయితే ఎక్స్‌పోజింగ్‌ ఉండే బట్టలు వేసుకోవద్దని కండిషన్ పెట్టాడు. మొదట్లో రాఖీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదిల్‌ కుటుంబానికి కూడా తన డ్రెస్సింగ్‌ సెన్స్‌ నచ్చకపోవడంతో చివరకు రాఖీ మారక తప్పలేదు.

Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రాఖీ సావంత్ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో ఉండాలంటే స్కిన్‌ షో తప్పదు. సల్వార్‌ డ్రెస్‌తో కెరీర్‌ మొదలుపెట్టినా తర్వాత బికినీ వేసుకోక తప్పదు. నా లాగా ఇండస్ట్రీలో గాడ్‌ ఫాదర్‌ లేనివాళ్లకు అస్సలు తప్పదు. కానీ అదిల్‌కు నేను ఎక్స్‌పోజింగ్‌ చేసేలా డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఇష్టం లేదు. ఇప్పుడు అవార్డుల ఫంక్షన్‌కు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో అతనే సెలెక్ట్ చేస్తాడు. అతను సెలెక్ట్ చేసిన బట్టలే నేను వేసుకుంటాను. ఇండస్ట్రీని, అదిల్‌ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఓ లిమిట్‌లో ఉండాలి అని డిసైడ్ అయ్యాను” అని తెలిపింది.