Rakul Preet Singh : పాన్ ఇండియా సినిమాలపై రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు..

రకుల్ మాట్లాడుతూ.. ''పాన్‌ ఇండియా సినిమా అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ అంతకుముందే సౌత్ సినిమాలు హిందీలో అనువాదమై, టీవీల్లో వచ్చేవి. అప్పుడు..................

Rakul Preet Singh : పాన్ ఇండియా సినిమాలపై రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు..

Rakul

Rakul Preet Singh :  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఇప్పటికే రకుల్ చేతిలో దాదాపు అరడజనుకి పైగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ పాన్ ఇండియా సినిమాలపై వ్యాఖ్యలు చేసింది.

 

Janhvi Kapoor : నో చెప్తున్నా.. జాన్విపై టాలీవుడ్‌కి ఎందుకంత క్రేజు??

రకుల్ మాట్లాడుతూ.. ”పాన్‌ ఇండియా సినిమా అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ అంతకుముందే సౌత్ సినిమాలు హిందీలో అనువాదమై, టీవీల్లో వచ్చేవి. అప్పుడు కూడా వాటిని హిందీ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలని చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమా చాలా భాషల్లో విడుదలవుతోంది కాబట్టి అందరూ చూసే వీలుంది. ఇప్పుడు సినిమాకి భాష లేదు. సినిమా అంటే ఎమోషన్‌. సౌత్ సినిమాలు ఇతర భాషల్లో సక్సెస్ అవ్వడం మంచిదే. సౌత్‌, నార్త్‌ రెండూ కలిస్తే ఇంకా అద్భుతాలు కూడా చేయొచ్చు” అని తెలిపింది. రకుల్ చెప్పినట్టే ఇప్పటికే పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. పలువురు బాలీవుడ్ నటులు సౌత్ లో నటిస్తున్నారు.