RakulPreeth Marriage: రకుల్‌ప్రీత్ పెళ్లి ఈ ఏడాదే – మంచు లక్ష్మీ

ఇక్కడా అదే జరిగింది రకుల్ ప్రీత్ సింగ్.. మంచు లక్ష్మీలు జంటగా వెళ్లిన షోలో రకుల్ పెళ్లి గురించి లీక్ వచ్చేసింది.

RakulPreeth Marriage: రకుల్‌ప్రీత్ పెళ్లి ఈ ఏడాదే – మంచు లక్ష్మీ

Rakulpreeth Marriage

RakulPreeth Marriage: హీరో.. హీరోయిన్ పెళ్లి, లవ్ లాంటి ముచ్చట్ల గురించి అభిమానులకు మామూలు ఇంట్రస్ట్ ఉండదు. వాళ్లెప్పుడు నోరు జారితే ఎలా బయటపడతాయా అని ఎదురుచూస్తుంటారు. సీక్రెట్ గా నడిపే రిలేషన్స్ బయటపడకూడదని జాగ్రత్త పడే సెలబ్రెటీల గుట్టు ఫ్రెండ్స్ లీక్ చేసేస్తుంటారు. ఇక్కడా అదే జరిగింది రకుల్ ప్రీత్ సింగ్.. మంచు లక్ష్మీలు జంటగా వెళ్లిన షోలో రకుల్ పెళ్లి గురించి లీక్ వచ్చేసింది.

ఇండ‌స్ట్రీలో కొంద‌రి మధ్య మాత్రమే దాపరికాల్లేని ఫ్రెండ్ షిప్ నడుస్తుంటుంది. చాలా స్వ‌చ్ఛంగా, ఒక‌రికొక‌రు క‌ష్ట సుఖాల‌లో అండ‌గా మరొకరు నిలబడే స్నేహంతో మెలిగే వ్యక్తుల్లో మంచు ల‌క్ష్మీ- ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా.

రీసెంట్‌గా వీరిద్ద‌రు రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారీ షోకు అతిథులుగా వెళ్లారు. ఆ షోలో ప‌లు విష‌యాల‌ గురించి మాట్లాడాక మంచు ల‌క్ష్మీ.. ర‌కుల్ పెళ్లిపై నోరు విప్పింది.

ఈ ఏడాదిలోనే ర‌కుల్ పెళ్లి చేసుకోనుంద‌ని మంచు ల‌క్ష్మీ చెప్ప‌డంతో, దానికి ర‌కుల్ కాదు కాదంటూ చెప్పుకొచ్చింది. ఇప్ప‌ట్లో నా పెళ్లి లేద‌ని ర‌కుల్ చెబుతున్నా కూడా పెళ్లి ప్రయత్నాలైనా జరుగుతాయి, లేకపోతే బాయ్‌ఫ్రెండ్‌ రావొచ్చని లక్ష్మి చెప్పకనే చెప్పింది.

వ‌చ్చే అబ్బాయి ఎవ‌రో నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ర‌కుల్ గురించి అన్ని విష‌యాలు చెబుతానంటూ బ‌దులిచ్చింది. గతంలో కొన్ని నెలలు ర‌కుల్‌-రానా డేటింగ్‌లో ఉన్న‌ట్టు పుకార్లు చక్కర్లు కొట్టాయి.