Upasana Birthday: భర్త చరణ్ విషెష్.. నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ సరిపోదు!

ఉపాసన కొణిదెల.. మెగా ఫ్యామిలీ కోడలిగానే కాకుండా సేవాకార్యక్రమాలు చేయడంలో ఆమెకి ప్రత్యేకమైన పేరుంది. ఒకవిధంగా ఉపాసన పుట్టినరోజంటే మెగా ఫ్యామిలీకి ఆ రోజు ప్రత్యేకమైన రోజే. అలాంటి ప్రత్యేకమైన రోజున ఉపాసన భర్త రామ్ చరణ్ కూడా అంతే ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Upasana Birthday: భర్త చరణ్ విషెష్.. నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ సరిపోదు!

Upasana Birthday

Upasana Birthday: ఉపాసన కొణిదెల.. మెగా ఫ్యామిలీ కోడలిగానే కాకుండా సేవాకార్యక్రమాలు చేయడంలో ఆమెకి ప్రత్యేకమైన పేరుంది. ఒకవిధంగా ఉపాసన పుట్టినరోజంటే మెగా ఫ్యామిలీకి ఆ రోజు ప్రత్యేకమైన రోజే. అలాంటి ప్రత్యేకమైన రోజున ఉపాసన భర్త రామ్ చరణ్ కూడా అంతే ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వీరి మధ్య అనుబంధాన్ని తెలుపుతూనే.. ఉపాసనను కొనియాడిన తీరుతో నెటిజన్లు ఆ విషెస్‌కు ఫిదా అవుతున్నారు.

‘అవసరంలో ఉన్న ప్రజలకు కానీ.. నీ కుటుంబానికి కానీ.. నీ బెస్ట్ ఉవ్వడంలో ఎప్పుడూ నువ్వు వెనకడుగు వెయ్యలేదు. నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ కూడా సరిపోదు.. హ్యాపీ బర్త్ డే’ అంటూ చరణ్ తన ప్రేమను ఇలా అద్భుతమైన పదాల్లో వ్యక్తపరిచాడు. ఉపాసన పనులను గౌరవిస్తూనే.. తన బాధ్యతలను గుర్తుచేస్తూనే.. తన ప్రేమను వ్యక్తపరచిన ఈ శుభాకాంక్షలతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఉపాసన పలు కార్యక్రమాలతో పాటు మరికొన్ని సామజిక కార్యక్రమాలలో కూడా ముందుంటారు. మరోవైపు చెర్రీకి సంబంధించిన ఫొటోలు, అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు దగ్గరయ్యారు. ప్రేమించి ఒక్కటైన ఈ జంట వివాహబంధానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)