Ori Devuda: మాస్ కా దాస్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఓమై కడువలే’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Ram Charan To Grace Vishwak Sen Ori Devuda Pre-Release Event
Ori Devuda: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఓమై కడువలే’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తుండగా, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 16న రాజమండ్రిలోని మంజీరా ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మామూలుగా లేదుగా..!
ఈ వార్తతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. లియన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
Rajamundry get ready…..
It’s MAN OF MASSES FOR MASS KA DASS??#MegaPowerStar @AlwaysRamCharan going to grace the Grand Pre-Release Event of #OriDevuda Tomorrow 2pm onwards?️https://t.co/P0KLFQ7ZtM@VenkyMama @mipalkarofcl @StarAshaBhat @Dir_Ashwath @PVPCinema pic.twitter.com/76EuWBvh0E
— VishwakSen (@VishwakSenActor) October 15, 2022