Ram Charan : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై రామ్ చరణ్ ట్వీట్.. బంగారు తెలంగాణ కల!
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్..

Ram Charan tweet on Decade celebrations of Telangana Formation Day 2023
Ram Charan – Telangana Formation Day : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఏమి చేసిన నెట్టింట వైరల్ అవుతుంది. నార్త్ టు సౌత్ ఏ స్టార్ హీరో అందుకొని పలు గౌరవాలు అందుకుంటూ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యిపోతున్నాడు. దీంతో లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు చరణ్ చేసే ప్రతి పనిని గమనిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా నేడు (జూన్ 2) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కావడంతో పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ఒక ట్వీట్ చేశాడు.
Bhola Shankar : భోళా మ్యానియా మొదలైపోయింది.. ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్!
“తెలంగాణ స్టేట్ ఏర్పాటు అయ్యి పది సంవత్సరాలు అవుతుంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Sharwanand : మొదలైన శర్వానంద్ పెళ్లి సంబరం.. వీడియో వైరల్!
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. చరణ్ ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి చేస్తామంటూ నిర్మాత దిల్ రాజు తెలియజేశాడు. అప్పుడే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు…
— Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023