Ram Gopal Varma: సుల్తానాతో వర్మ.. మరో వీడియో వైరల్!

గ్రేట్ క్రియేటివ్ దర్శకుడి నుండి వివాదాస్పద దర్శకుడిగా మారిన రాంగోపాల్ వర్మ ఈ మధ్య ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Ram Gopal Varma: సుల్తానాతో వర్మ.. మరో వీడియో వైరల్!

Ram Gopal Varma

Ram Gopal Varma: గ్రేట్ క్రియేటివ్ దర్శకుడి నుండి వివాదాస్పద దర్శకుడిగా మారిన రాంగోపాల్ వర్మ ఈ మధ్య ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇనయా సుల్తానా పుట్టిన రోజు వేడుకలో వర్మ సుల్తానాలో కలసి రంగీలా సినిమాలోని పాటకు స్టెప్పులు వేశాడు. ఆమె కాళ్లు పట్టుకొని విచిత్రంగా వ్యవరించాడు. ఆమెను పెనవేసుకొని ముద్దులు పెడుతూ అబ్బో రచ్చ రచ్చ చేశాడు. దీనిపై సోషల్ మీడియా నుండి టీవీ డిబేట్ల వరకు ఎన్నో జరిగిపోగా అందుకు వర్మ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు.

ఇది నేను కాదు.. ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఇనయా సల్తానా కానే కాదంటూ.. ఆ వీడియోను పోస్టు చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీద ఒట్టు అంటూ తనదైన శైలీలో ఆర్జివి ట్వీట్ చేశారు. ఇక ఇనయా సుల్తానా కూడా ఇది ఒక ‘బెస్ట్ నమ్మశక్యం కాని క్షణాలు అని తన పుట్టిన రోజును ఎప్పుడూ ఇలా జరుపుకోలేదని’ చెప్తూ ట్వీట్ చేసింది. ఆ వెంటనే సుల్తానాతో దిగిన ఓ సెల్ఫీ పోస్ట్ చేసిన వర్మ వైరల్ వీడియోలో నా డ్యాన్స్ పార్టనర్‌ అందమైన సుల్తానాతో అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు.

అదలా ఉండగానే ఇప్పుడు వీరిద్దరి డాన్స్ చేసిన మరో వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇది స్వయంగా ఇనయా సుల్తానా ఖాతా నుండి షేర్ అవగా దానికి వర్మ ఖాతా కూడా ట్యాగ్ చేసింది. ఇందులో ఒరిజినల్ సౌండ్స్ కూడా ఉండడంతో మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ వీడియోలలో సుల్తానా, వర్మతో పాటు ఉన్న నటి జ్యోతి, మరో నటుడు వర్మ దేవుడు ఆయన మీద పడిఏడవడం ఎందుకంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా పెట్టగా వర్మ అభిమానులు కూడా ఆయన్ని వెనకేసుకొస్తున్నారు.