Ram Pothineni: రీ-రిలీజ్‌కు ‘రెడీ’ అంటోన్న రామ్.. ఎప్పుడు వస్తున్నాడో తెలుసా?

యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడీ’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 14న ఈ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Ram Pothineni: రీ-రిలీజ్‌కు ‘రెడీ’ అంటోన్న రామ్.. ఎప్పుడు వస్తున్నాడో తెలుసా?

Ram Pothineni Ready Movie To Re-Release On This Date

Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో ‘రెడీ’ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో అందాల భామ జెనీలియా హీరోయిన్‌గా నటించగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్.

Ram Pothineni: రామ్ కోసం బోయపాటి మరొక బ్యూటీని దించుతున్నాడుగా!

అయితే, ఈ సినిమాను ఇప్పటికీ టీవీల్లో చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు అభిమానులు. తాజాగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మే 14న రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మూవీని థియేటర్లలో మరోసారి ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

Ram Pothineni: రామ్‌తో సినిమాపై గౌతమ్ క్లారిటీ!

ఇక ఈ సినిమాను శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేశారు. కాగా, రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.