Ranbir-Alia : పెళ్లి తర్వాత మరింత బిజీగా మారిన బాలీవుడ్ జంట.. | Ranbir and alia busy with movies after marriage

Ranbir-Alia : పెళ్లి తర్వాత మరింత బిజీగా మారిన బాలీవుడ్ జంట..

బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ రీసెంట్ గా పెళ్లితో ఒకటైన ఈ జంట బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆలియా మాత్రం అన్ని ఇండస్ట్రీల్లో ప్రూవ్ చేసుకుంటూ..............

Ranbir-Alia : పెళ్లి తర్వాత మరింత బిజీగా మారిన బాలీవుడ్ జంట..

Ranbir-Alia :  బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ రీసెంట్ గా పెళ్లితో ఒకటైన ఈ జంట బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆలియా మాత్రం అన్ని ఇండస్ట్రీల్లో ప్రూవ్ చేసుకుంటూ హాలీవుడ్ లో సైతం సత్తా చాటాలని చూస్తుంటే, రణబీర్ మాత్రం అందుకు భిన్నంగా సొంత ఇండస్ట్రీతో నే వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయొచ్చంటున్నారు.

ఇప్పటికే ఆలియాకు తెలుగులో ట్రిపుల్ ఆర్, హిందీలో కతియావాడితో పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు నార్త్, సౌతే కాకుండా హాలీవుడ్ టెక్నిషియన్స్ తో మింగిల్ అయిపోయి అక్కడా సత్తా చాటాలని చూస్తుంది. ఆలియా ఏ ఇండస్ట్రీతోనైనా ఇట్టే కలిసిపోతుంటే, రణబీర్ మాత్రం ఇతర ఇండస్ట్రీస్ లో మింగిల్ కాలేనంటున్నారు. తను ఆలియా అంత స్పీడ్ కాదు అంటున్న రణబీర్ తనకు హాలీవుడ్ డ్రీమ్స్ ఏమీ లేవని కవరింగ్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు.

Brahmastra Trailer : మెగా వాయిస్ తో.. బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్..

సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియాభట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ కెరీర్ స్పీడప్ చేసింది. ప్రస్తుతం ఆలియా లండన్ లో ఉంది. తన కెరీర్ లో ఫస్ట్ హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ షూట్ లో పాల్గొంటుంది. బ్రహ్మాస్త్ర మూవీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే రణబీర్ కపూర్ తో జోడిగా రాబోతుంది. ఇంకా బాలీవుడ్ నుంచి డార్లింగ్స్, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, జీలే జరా సినిమాలు ఆలియా అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక రణబీర్ కపూర్ 2018లో రిలీజ్ అయిన సంజు తర్వాత మళ్లీ తెరమీద కనిపించలేదు. ఈ ఇయర్ మాత్రం బ్రహ్మాస్త్రతో పాటు, షంషేరా రిలీజ్ కానుంది. అందాజ్ అప్నా అప్నా, వెవిల్, లవ్ రంజన్ నెక్స్ట్, యానిమల్ లాంటి సినిమాలు రణబీర్ లిస్ట్ లో ఉన్నాయి.

ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్న నానుడి ఒంటబట్టించుకున్న ఆలియా గంగూభాయ్ కతియావాడితో తన స్టామినా సింగిల్ గానే ప్రూవ్ చేసుకుంది.ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో చకచకా షూటింగ్ కానిచ్చేస్తుంది. రణబీర్ మాత్రం సొంత ఇండస్ర్టీలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే, వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూ రీచ్ అవ్వొచ్చనే ఫార్ములానే ఫాలో అవుతూ ఆలియాకు పూర్తి భిన్న మనస్తత్వంతో ఉన్నారు. ఈ ఇద్దరి మనస్తత్వాలు రీల్ లైఫ్ లోనే బిన్నంగా ఉన్నాయా, లేక రియల్ లైఫ్ లో కూడా భిన్న మనస్తత్వాలు ఒకటిగా కలిశాయా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

VirataParvam : ‘లేడీ పవర్ స్టార్’ బిరుదుపై స్పందించిన సాయిపల్లవి..

ఇక ఇటీవలే రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”పెళ్లి అయిన తెల్లారి నుంచే ఇద్దరం షూటింగ్స్ కి వెళ్ళిపోయాము. చాలా బిజీగా ఉన్నాము. కాస్త టైం దొరికితే ఎక్కడికైనా వెల్దామనుకుంటున్నాం” అని తెలిపాడు. మరి ఇన్ని సినిమాల మధ్యలో టైం దొరికి ఈ బాలీవుడ్ క్యూట్ కపుల్ ఎప్పుడు విహారయాత్రకు వెళ్తారో చూడాలి.

×