మహేష్ విడుదల చేసిన మెగా మేనల్లుడి సాంగ్

  • Published By: sekhar ,Published On : November 11, 2020 / 05:24 PM IST
మహేష్ విడుదల చేసిన మెగా మేనల్లుడి సాంగ్

Ranguladdhukunna Lyrical Song: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయవుతున్న సినిమా ‘ఉప్పెన’.. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. ‘నీకన్నునీలి సముద్రం’ పాటకు ఏ స్థాయి స్పందన వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు.


తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘రంగులద్దుకున్న’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. దేవి ఈ పాటను దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితమిచ్చారు. శ్రీమణి లిరిక్స్ రాయగా యాజిన్ నిజార్, హరిప్రియ చాలా చక్కగా ఈ కూల్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. థియేటర్లు తిరిగి ప్రారంభమగానే ‘ఉప్పెన’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.