Prabhas: ప్రభాస్ కోసం పోటీపడుతున్న కియారా, రష్మిక.. ఎవరు సెట్ అవుతారో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో...

Prabhas: ప్రభాస్ కోసం పోటీపడుతున్న కియారా, రష్మిక.. ఎవరు సెట్ అవుతారో?

Rashmika Mandanna And Kiara Advani In Talks For Prabhas Spirit

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పాటు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా ప్రభాస్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో నిటిస్తున్నాడు.

Prabhas : మరో బాలీవుడ్ భామకి స్పెషల్ ఫుడ్ పంపిన బాహుబలి

అంతేగాక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందన, లేదా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీలను లైన్‌లో పెట్టిన డైరెక్టర్, ఈ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ ఇద్దరు కూడా తమ పర్ఫార్మెన్స్‌లతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుండటం ఇప్పుడు చిత్ర యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

Prabhas: బ్రేక్‌లోనే కానిచ్చేస్తానంటోన్న ప్రభాస్!

ఇద్దరికీ అదిరిపోయే ట్యాలెంట్ మరియు క్రేజ్ ఉండటంతో, ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అని చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుంది. ప్రభాస్ పక్కన ఈ ఇద్దరిలో ఎవరితో కెమిస్ట్రీ సెట్ అవుతుందా అని వారు ఆలోచిస్తున్నారు. మరి ఈ సమస్యకు సందీప్ రెడ్డి వంగా ఎలాంటి పరిష్కారం చూపుతాడో చూడాలి. ఏదేమైనా ఈ ఇద్దరి పేర్లు ప్రస్తుతం ప్రభాస్ మూవీ కోసం వినిపిస్తుండటంతో వీరిద్దరిలో ఎవరు హీరోయిన్‌గా సెలెక్ట్ అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.