కెమెరా, యాక్షన్, స్టార్ట్ : ‘డిస్కోరాజా’ షూటింగ్ ప్రారంభం

  • Edited By: madhu , March 4, 2019 / 07:48 AM IST
కెమెరా, యాక్షన్, స్టార్ట్ : ‘డిస్కోరాజా’ షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ లో మాస్ మహరాజగా పేరు తెచ్చుకున్న ‘రవితేజ’ న్యూ మూవీ ‘డిస్కోరాజా’ సినిమా పట్టాలెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో రవితేజ, దర్శకుడు ఆనంద్, నిర్మాత రామ్ తాళ్లూరి తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి .. ఈ కథకి కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో ‘రవితేజ’ జోక్యం చేేసుకుని తమ కథలో ఆ పోలికలు ఎక్కడా కనిపించకుండగా మార్పులు చేయమని వీఐ ఆనంద్ కి చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ మార్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

రవితేజ నటించిన కొన్ని సిినిమాలు పరాజయం కావడంతో ఇతను రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ‘పవర్’ సినిమా తర్వాత వచ్చిన ‘బెంగాల్ టైగర్’, ‘కిక్ 2’ డిజాస్టర్ అయ్యాయి. అనంతరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో  ‘రాజా ది గ్రేట్’తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే ఊపులో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’ సినిమాల్లో నటించాడు..కానీ ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ అంథోని’ సినిమాలో నటించాడు..ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో రవితేజ కెరీర్ కష్టాల్లో పడ్డటే అనే టాక్ వచ్చింది. 
Also Read : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ

ఈ నేపథ్యంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ సినిమాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ‘డిస్కోరాజా’ అనే మూవీ చేసేందుకు సిద్ధ‌మయ్యాడు. ‘ర‌వితేజ’ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. అ వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ మూవీకి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ సినిమా కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనుండడంతో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
Also Read : వీళ్లను మీరు ఎంతకు కొన్నారు: ఉత్తమ్‌కు కేటీఆర్ కౌంటర్