Raviteja : షూటింగ్‌లో రవితేజకి గాయం.. పది కుట్లు.. అయినా నో రెస్ట్.. | raviteja injured in shooting but without taking rest continuously working

Raviteja : షూటింగ్‌లో రవితేజకి గాయం.. పది కుట్లు.. అయినా నో రెస్ట్..

మాస్ మహారాజ్ ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలని అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ చేతిలో.........

Raviteja : షూటింగ్‌లో రవితేజకి గాయం.. పది కుట్లు.. అయినా నో రెస్ట్..

Raviteja :  మాస్ మహారాజ్ ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలని అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలో ‘రామారావు ఆన్ డ్యూటీ’గా రానున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ హీరోగా మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నూపుర్‌ సనన్, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాణంలో తెరకెక్కుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా షూట్ జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తుండగా రవితేజ గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయమై, పది కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ తెలిపారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.

Ante Sundaraniki: అంటే.. సుందరానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

అయినా రవితేజ ‘నో రెస్ట్‌’ అంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్, ఇతర నటీనటుల డేట్స్‌ని దృష్టిలో పెట్టుకుని, తన కారణంగా షూటింగ్‌ ఆగకూడదు అని రవితేజ రెండు రోజులు హాస్పిటల్ లో ఉండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు, ప్రేక్షకులు రవితేజని మెచ్చుకుంటున్నారు.

×