Ravanasura Movie: ఓటీటీలో రావణాసురుడి ఎంట్రీ.. అప్పుడేనా..?

మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలో మే ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Ravanasura Movie: ఓటీటీలో రావణాసురుడి ఎంట్రీ.. అప్పుడేనా..?

Raviteja Ravanasura Movie OTT Streaming From This Date

Ravanasura: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రావణాసుర’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన తీరు ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాలోని కంటెంట్ బాగున్నా, ఆడియెన్స్ ఎందుకో ఈ సినిమాను ఆదరించలేదు.

Ravanasura: ఓటీటీలో ల్యాండింగ్‌కు రెడీ అయిన రావణాసుర.. ఎప్పుడంటే?

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగియడంతో ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు కూడా ఓటీటీలో రావణాసుర మూవీని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే, ఈ సినిమాను మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను మే 5న స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమవుతుందట.

Ravanasura: ‘రావణాసుర’ నుండి వీడియో క్లిప్ లీక్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వివాదాస్పద డైలాగ్!

కాగా, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.