Shakini Dakini : శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా..

సురేష్ ప్రొడక్షన్స్ అంతకుముందు 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాని సమంత మెయిన్ లీడ్ లో 'ఓ బేబీ'గా రీమేక్ చేసి విజయం సాధించింది. దీంతో మరో కొరియన్ సినిమాని రీమేక్ చేయబోతున్నారు.

Shakini Dakini : శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా..

Shakini Dakini

Shakini Dakini :  ఇటీవల అన్ని పరిశ్రమలలోను రీమేక్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒక భాషలో సినిమా హిట్ అయితే దాని రీమేక్ రైట్స్ తీసుకొని మరో భాషలో అక్కడి నేటివిటీకి తగ్గట్టు నిర్మిస్తున్నారు. ఇటీవల ఓటిటికి జనాలు బాగా దగ్గరవడంతో అన్ని బాషల సినిమాలని చూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడి సినిమా అయినా, బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల తెలుగు ప్రేక్షకులు కొరియన్ సినిమాలకి బాగా అలవాటు పడ్డారు. దీంతో మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మంచి కొరియన్ సినిమాలని సెలెక్ట్ చేసి రీమేక్ చేస్తున్నారు.

Rajamouli : నా భార్యే నన్ను పోషించింది : రాజమౌళి

సురేష్ ప్రొడక్షన్స్ అంతకుముందు ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సినిమాని సమంత మెయిన్ లీడ్ లో ‘ఓ బేబీ’గా రీమేక్ చేసి విజయం సాధించింది. దీంతో మరో కొరియన్ సినిమాని రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించినా కరోనా వల్ల ఆలస్యమయింది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘శాకిని డాకిని’ అనే టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇద్దరు అమ్మాయిలతో సాగే కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో మెయిన్ లీడ్స్ గా రెజీనా మరియు నివేదా థామస్ లు నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే వస్తుందని ప్రకటించారు.