Renu Desai : రేణు దేశాయ్ ‘మయోకార్డియల్ బ్రిడ్జింగ్’ సమస్యతో బాధపడుతోందా? ఇది ప్రమాదకరమా?

'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక అంశాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తను ఇటీవల ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించారు.

Renu Desai : రేణు దేశాయ్ ‘మయోకార్డియల్ బ్రిడ్జింగ్’ సమస్యతో బాధపడుతోందా? ఇది ప్రమాదకరమా?

Renu Desai

Renu Desai : 18 ఏళ్ల గ్యాప్ తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్నారు రేణు దేశాయ్. ఈ సినిమా అక్టోబర్ 20 న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లతో బిజీగా ఉన్న రేణు కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Renu Desai : లాంగ్ గ్యాప్ తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’తో రీఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత రేణు దేశాయ్‌కి చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయట. అయితే తాను ఇంకా వేటిని అంగీకరించలేదని చెప్పారామె. తను ‘మయోకార్డియల్ బ్రిడ్జింగ్’ అనే గుండె సమస్యతో బాధపడుతున్నానని అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటానని వెల్లడించారు. ఈ సమస్య కారణంగా వాడే మెడిసిన్స్ వల్ల తాను వెయిట్ పెరిగానని.. వాటి వల్ల ఒక్కోసారి కోమాలోకి వెళ్లినట్లు అవుతుందని చెప్పుకొచ్చారామె. డాక్టర్లు జాగ్రత్తగా ఉండమని సూచించారని తెలిపారు.

రేణు దేశాయ్ ఫేస్ చేస్తున్న మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అంటే..గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు అవయవం ఉపరితంలో ఉంటాయి. కానీ కొందరిలో ఈ ధమనులలో ఒకటి గుండె కండరాల్లోకి వెళ్తూ.. మళ్లీ బయటకు వస్తుందట. దీనిని మయోకార్డియల్ బ్రిడ్జ్ అని పిలుస్తారట. పుట్టినప్పటి నుంచి ఈ సమస్య ఉన్నవారికి సాధారణంగా ఇది ప్రమాదకరం కాదట. ఇది ఇలా ఉండటం వల్ల గుండె కండరాలకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందట. వ్యాయామం చేసే సమయంలో ఛాతి నొప్పి లేదా అసౌకర్యానికి గురి చేస్తుందట. కొందరిలో గుండెపోటు వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయట. అలాంటి సందర్భాల్లో వైద్యులు బీటా బ్లాకర్స్ అనే మందును సూచిస్తారట. ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నవారికి ఆపరేషన్ కూడా అవసరం అవుతుందట.

Renu Desai : పవన్ కళ్యాణ్‌తో విడాకుల తరువాత.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పిన రేణూదేశాయ్..

చాలామందిలో చిన్నతనం నుంచి కనిపించే మయోకార్డియల్ బ్రిడ్జ్ సమస్య రేణు దేశాయ్‌కి ఇటీవల బయటపడిందట. కొంచెం నడిస్తే ఆయాసం, హార్ట్ రేట్ పెరగడం, ఒక రకమైన ఆందోళన, హార్ట్ అటాక్ వంటి ఫీలింగ్స్ అనిపిస్తాయని రేణు చెప్పారు. మంచి క్యారెక్టర్లు వస్తే సినిమాలు కంటిన్యూ చేస్తానని అయితే ముందు తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని రేణు వెల్లడించారు.