Sirivennela : స్వర్గంలో కలుద్దాం.. త్వరలో నేనూ వస్తా.. ఆర్జీవీ ట్వీట్

రామ్‌ గోపాల్‌ వర్మకు సిరివెన్నెలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందరి మీద నెగిటివ్ గా, సెటైరికల్ గా ట్వీట్ చేసే ఆర్జీవీ మొట్ట మొదటి సారి సిరివెన్నెలపై పాజిటివ్ గా......

Sirivennela : స్వర్గంలో కలుద్దాం.. త్వరలో నేనూ వస్తా.. ఆర్జీవీ ట్వీట్

New Project

Sirivennela :  టాలీవుడ్‌ సినీ పరిశ్రమ గర్వపడే గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటు. మూడు వేలకుపైగా పాటలు రాసిన ఆయనకు ఎంతో మంది దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులతో అవినాభావ అనుబంధం ఉంది. అలాంటి వారిలో రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు. గతంలో ఆర్జీవీ ప్రతి సినిమాలోనూ సిరివెన్నెల పాట ఉండాల్సిందే. వర్మ తొలిచిత్రం ‘శివ’ సినిమా నుంచి సిరివెన్నెల ఆయనకు పాటలు రాస్తున్నారు. దీంతో రామ్‌ గోపాల్‌ వర్మకు సిరివెన్నెలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందరి మీద నెగిటివ్ గా, సెటైరికల్ గా ట్వీట్ చేసే ఆర్జీవీ మొట్ట మొదటి సారి సిరివెన్నెలపై పాజిటివ్ గా ట్వీట్ చేశారు.

Ajith : ఇకపై నన్ను ‘తల’ అని పిలవకండి : అజిత్

సిరివెన్నెల మరణంపై ఆర్జీవీ స్పందిస్తూ సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని ట్విట్టర్ లో వాయిస్ రూపంలో షేర్ చేశారు. ” సిరివెన్నెలను మొదటి సారి శివ సినిమా కోసం కలిశానని, ఆ సినిమా కోసం కవిత్వం లాంటిది లేకుండా సరదాగా కాలేజ్‌ విద్యార్థులు మాట్లాడుకునేలా పదాలతో సాంగ్‌ రాయమని అడిగితే రెండు మూడు నిమిషాల్లోనే ‘బోటని పాఠముంది..’ అని పాడారు. ఆయనతో ఉన్న మెమోరీస్‌ గుర్తు తెచ్చుకుంటే నా సినిమాలకే ఎన్నో పాటలు రాశారు అని ఆయన రాసిన కొన్ని పాటలు పాడి వినిపించారు. ఆయన మరణించడం నాకు షాకింగ్‌గా ఉందన‍్నారు.”

Mahesh Babu : పోలీసులను ఆశ్రయించిన మహేష్‌బాబు సోదరి

”అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోతారు. కానీ ముందు తరాలకు ఒక మార్గదర్శకునిగా రచయితలకు ఒక గురువుగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు అని ఆర్జీవీ అన్నారు. ‘మీరు ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్‌ రాసారు కాబట్టి కచ్చితంగా స్వర్గానికి వెళ్లుంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హాయ్ చెప్పండి. కానీ నేను ఎక్కవ పాపాలు చేసి నరకానికి వెళ్తాను. పొరపాటున స్వర్గానికి వస్తే మాత్రం మీరెలాగో నాతో వోడ్కా తాగరు కాబట్టి మన ఇద్దరం కలిసి అమృతం ఓ పెగ్గేద్దాం అని ఆడియో క్లిప్‌ ని ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ.