Richa Chadha : స్టార్ సెలబ్రిటీలు సైతం రిచా చద్దాపై ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసి సారీ చెప్పిన భామ..

టీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ప్రకటన చేశారు. అయితే దీనికి బాలీవుడ్ భామ రిచా చద్దా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...............

Richa Chadha :  స్టార్ సెలబ్రిటీలు సైతం రిచా చద్దాపై ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసి సారీ చెప్పిన భామ..

Richa Chadha says sorry regarding tweet on army

Richa Chadha :  ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ప్రకటన చేశారు. అయితే దీనికి బాలీవుడ్ భామ రిచా చద్దా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘గాల్వాన్ సేస్ హాయ్’ అని ట్వీట్ చేసింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం లేపింది.

భారతదేశం మరియు చైనాల మధ్య 2020 గాల్వాన్ ఘర్షణలో భారత జవాన్ల త్యాగాన్ని ఎగతాళి చేసేలా ఆమె ట్వీట్ ఉందంటూ, ఆర్మీని అవమానపరుస్తుందంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ట్వీట్ పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తూ రిచా చద్దాపై ఫైర్ అయ్యారు. హీరోయిన్ ప్రణీత, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మంచు విష్ణు.. ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం రిచా చద్దా ట్వీట్ కి కౌంటర్ ఇస్తున్నారు. రిచాపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు.

Rashmika Mandanna : రష్మికపై అక్కడ బ్యాన్..? ట్వీట్ చేసిన ఫిలిం క్రిటిక్.. నిజమేనా??

దీంతో రిచా చద్దా తన ట్వీట్ ని డిలీట్ చేసి సారీ చెప్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో.. ”నేనెవర్ని బాధపెట్టాలని ఆ ట్వీట్ చేయలేదు, ఆ ట్వీట్ చాలా మందిని బాధపరిచింది. పెద్ద వివాదంగా మారింది. నాకు తెలీకుండా ఎవరినైనా హర్ట్ చేస్తే నన్ను క్షమించండి. నేను కావాలని ఆ ట్వీట్ చేయలేదు. నా వల్ల బాధపడ్డ అందరికీ క్షమాపణలు చెప్తున్నా. మా అన్నయ్య ఆర్మీలోనే పని చేస్తాడు. మా మామయ్య పారాట్రూపర్‌. దేశాన్ని కాపాడే క్రమంలో సైనికుడు గాయపడ్డా, అమరుడైనా అతడి కుటుంబమంతా ఎంతో బాధకి గురవుతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా సొంత నానాజీ లెఫ్టినెంట్‌ కల్నల్‌గా భారత ఆర్మీకి సేవలందించారు. 1960లో జరిగిన ఇండో – చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్‌ తగిలింది. ఆర్మీపై గౌరవం నా రక్తంలోనే ఉంది” అని రిచా బాధపడుతూ సారీ చెప్పింది. మరి రిచా సారీతో ఈ వివాదం ముగుస్తుందేమో చూడాలి.