Riteish Deshmukh : మహిళా అభిమాని కాళ్ళు పట్టుకున్న హీరో..

బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ తన భార్య జెనీలియాతో కలిసి నటించిన సినిమా వేద్. ఈ సినిమాని మరాఠీలో తెరకెక్కించారు. దీనికి రితేష్ దర్శకత్వం వహించారు. వేద్ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్ గా.................

Riteish Deshmukh : మహిళా అభిమాని కాళ్ళు పట్టుకున్న హీరో..

Riteish Deshmukh touch a female fan feet

Riteish Deshmukh : బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ తన భార్య జెనీలియాతో కలిసి నటించిన సినిమా వేద్. ఈ సినిమాని మరాఠీలో తెరకెక్కించారు. దీనికి రితేష్ దర్శకత్వం వహించారు. వేద్ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాని డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా రితేష్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహారాష్ట్రలోని ఓ కాలేజీకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని రితేష్ తో కలిసి డ్యాన్స్ చేస్తానని అడిగింది. రితేష్ ఓకే చెప్పడంతో ఆ అభిమాని స్టేజి మీదకి వచ్చి రితేష్ తో కలిసి డ్యాన్స్ వేసింది.

BiggBoss 6 Day 92 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా??

దీంతో ఆ యువతి ఎమోషనల్ అయి ఏడుస్తూ రితేష్ కాళ్ళకి దండం పెట్టింది. ఆమెని లేపి రితేష్ కూడా ఆ యువతి కాళ్ళకి దండం పెట్టాడు. అనంతరం ఆ అభిమాని ఏడుస్తూ రితేష్ ని హగ్ చేసుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. రితేష్ ని అభిమానులు, నెటిజన్లు పొగిడేస్తున్నారు.