ఫ్యాన్ వార్: సినిమా హిట్ కాకపోతే పోర్న్ సినిమాలు చేసుకుంటా!

  • Published By: vamsi ,Published On : December 24, 2019 / 04:28 AM IST
ఫ్యాన్ వార్: సినిమా హిట్ కాకపోతే పోర్న్ సినిమాలు చేసుకుంటా!

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్. ప్రస్తుతం ‘ది బ్యాట్‌మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు రాబర్ట్. ఈ సినిమా వచ్చే వేసవికాలంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా కోసం రాబర్ట్ ప్యాటిన్సన్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినిమా హిట్ అవుతుందంటూ కాకపోతే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బ్యాట్ మ్యాన్‌గా ఇదివరకు హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల వార్నర్ బ్రదర్స్ సంస్థ బెన్ స్థానంలో రాబర్ట్ పాటిన్సన్‌ను తీసుకున్నారు. మ్యాట్ రీవ్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలొనే ది గార్డియన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు రాబర్ట్ ప్యాటిన్సన్. సినిమా ఆడితే ఫర్వాలేదు కానీ ఆడకపోతే మాత్రం పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లిపోతా అని చెప్పుకొచ్చాడు.

ఇందుకు కారణం ఫ్యాన్స్‌ తనపై పెంచుతున్న ఒత్తిడే. బ్యాట్ మెన్ సినిమాకు ఇంతకుముందు బెన్ అఫ్లెక్ హీరోగా చేయగా.. ఇప్పుడు అతని స్థానంలో రాబర్ట్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అది నచ్చని కొంతమంది అపెక్ అభిమానులు వార్నర్ బ్రదర్స్‌కు లేఖలు రాయడమే కాక రాబర్ట్‌ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. రాబర్ట్‌కు సపోర్ట్‌గా ఆయన అభిమానులు కూడా అపెక్‌పై ట్రోల్స్ చేస్తున్నరు.

ప్రస్తుతం రాబర్ట్ ప్యాటిన్సన్ క్రిస్టోఫర్ నొలాన్ డైరెక్ట్ చేస్తున్న ‘టెనెట్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.