Roja Daughter: నెటిజన్‌కు రిప్లైతో షాకిచ్చిన రోజా కూతురు

రోజా కూతురు అన్షు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన.. అన్షుకు ఓ నెటిజ‌న్ రోజా కూతురికి వినూత్నంగా మ‌న‌సులో

Roja Daughter: నెటిజన్‌కు రిప్లైతో షాకిచ్చిన రోజా కూతురు

Roja Daughter

Roja Daughter: ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చాక, ప్ర‌పంచ‌మే కుగ్రామంగా మారిపోయింది. ఒక‌ప్పుడు సినీ సెల‌బ్రిటీల‌ను చూడాల‌న్నా, మాట్లాడాల‌న్నా అసాధ్య‌మ‌ని అనుకునేవాళ్లు. ఆ తెరను పూడుస్తున్నామంటూ ఎన్నో చెత్త పుకార్లు ప్రచారం చేసేవి.

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇష్ట‌మైన, అయిష్ట‌మైన సెల‌బ్రిటీల‌తో అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా పంచుకోవ‌చ్చు. ఇదే క్రమంలో ఒక‌ప్ప‌టి టాలీవుడ్ నటి, ప్ర‌స్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా కూతురు.. నెటిజ‌న్ కామెంట్ కి ఇచ్చిన రిప్లై వైర‌ల్ అయ్యింది.

రోజా కూతురు అన్షు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన.. అన్షుకు ఓ నెటిజ‌న్ రోజా కూతురికి వినూత్నంగా మ‌న‌సులో మాట చెప్పాడు. స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు.

అన్షు స్పందిస్తూ… ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చి షాక్‌కు గురి చేసింది. రోజా కూతురి స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

తెలుగులో నాగార్జున సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ని అన్షు పేర్కొంది. ఇదిలా ఉండ‌గా త‌ల్లి రోజాను దృష్టిలో పెట్టుకుని ‘మీరు హీరోయిన్ అవుతారా’ అని ప్రశ్నించాడు. ‘ఇలా నన్ను చాలా మంది అడిగారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నాకు తెలియదు, అస్సలు ఆ ఆలోచన కూడా చేయలేదు’ అని అన్షు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

కానీ అన్షు న‌ట‌నంటే త‌న‌కిష్టం లేదనో, మ‌రొక‌టో చెప్ప‌కపోవ‌డంతో నెటిజ‌న్లు త‌మ‌వైన అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ఒక రోజు అన్షు వెండితెర‌పై త‌ప్ప‌క క‌నిపిస్తుంద‌నే నమ్మకాన్ని కనబరుస్తున్నారు.