RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్‌ను ఆచార్య తట్టుకోగలడా?

ఆర్ఆర్ఆర్.. ఆచార్య రెండూ ఒకేసారి చూసే అవకాశం వస్తే? ఒకవైపు బ్లాక్ బస్టర్ సినిమా.. మరోవైపు భారీ నష్టాలను చూసిన ప్లాప్ సినిమా ఉంటే ప్రేక్షకులు ఏ సినిమా చూస్తారు? ఒకేహీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ప్రేక్షకులు ఏ సినిమాని ఎంచుకుంటారు?

RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్‌ను ఆచార్య తట్టుకోగలడా?

Rrr Vs Acharya

RRR vs Acharya: ఆర్ఆర్ఆర్.. ఆచార్య రెండూ ఒకేసారి చూసే అవకాశం వస్తే? ఒకవైపు బ్లాక్ బస్టర్ సినిమా.. మరోవైపు భారీ నష్టాలను చూసిన ప్లాప్ సినిమా ఉంటే ప్రేక్షకులు ఏ సినిమా చూస్తారు? ఒకేహీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ప్రేక్షకులు ఏ సినిమాని ఎంచుకుంటారు?.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది మూవీ లవర్స్ మధ్య. ఎందుకంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. ప్లాప్ ముద్ర వేసుకున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య రెండూ ఒకేరోజు ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.

RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!

ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలై థియేటర్లలోకొచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆచార్య సినిమా రెండు వారాల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. కానీ ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాను ఈనెల 20న జీ ప్లెక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. దాదాపు అదే టైమ్ లో ఆచార్య సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు పెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆచార్య, ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ ఏర్పడినట్టయింది.

Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!

అయితే.. ఇక్కడ ఒక మెలిక కూడా ఉంది. నిర్ణీత రుసుము చెల్లించి జీ ప్లెక్స్ యాప్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చాలామంది చూసేశారు. వెయ్యి కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఇలాంటి టైమ్ లో మరోసారి డబ్బులు చెల్లించి ఓటీటీలో చూస్తారా అనేది అనుమానమే. కాకపోతే ఇది వారం, 10 రోజుల పాటే ఉంటుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ను నేరుగా జీ5లో స్ట్రీమింగ్ కు పెట్టేస్తారు. ఈ పదిరోజులలో ఆచార్య అట్రాక్ట్ చేయగలడా.. డబ్బు చెల్లించి మళ్ళీ ఆర్ఆర్ఆర్ ను చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.