Ramaraju For Bheem: ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్!..

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 12:25 PM IST
Ramaraju For Bheem: ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్!..

RRR: యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ‘‘RRR – రౌద్రం రణం రుధిరం’’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల కలయికలో స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది.




ఈ సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు తారక్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వనున్నట్లు మూవీ టీమ్ తెలియజేశారు. అక్టోబర్ 22న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియోకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది..

‘‘మార్చి వరకు మా షూటింగ్‌ అనుకున్నట్లు ముందుకు సాగింది. ఆ తర్వాత ప్రపంచమంతా ఆగిపోయింది. ఇప్పుడు సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది.. రెట్టించిన ఉత్సాహంతో…’’ అంటూ మెసేజ్‌తో పాటు వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అన్నీ శాఖల వారు షూటింగ్‌ను పునః ప్రారంభించడానికి ఏమేం పనులు చేస్తున్నారనే దాంతో పాటు మంగళవారం నుండి షూటింగ్‌ జరగనుందని తెలియజేశారు.




చివర్లో హీరోస్‌ రెడీ, యాక్షన్‌ అని జక్కన్న అనగానే మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ గుర్రంపై.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బుల్లెట్‌పై వచ్చే షాట్స్ వీడియోలో చూపించారు. అక్టోబర్ 22 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ పుట్టినరోజుకి రిలీజ్ చేసిన వీడియోకు తారక్ వాయిస్ చెప్పినట్లే.. ఈ వీడియోకు చెర్రీ వాయిస్ ఇవ్వనున్నాడు.