Indian 2 : కమల్ హాసన్ ఇండియన్ 2 లో మెయిన్ విలన్ ఎవరో తెలుసా?

కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో సిద్దార్థ్, బాబీ సింహా, సముద్రఖని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మెయిన్ విలన్ అతనే అంటూ తమిళ్ మీడియాలో..

Indian 2 : కమల్ హాసన్ ఇండియన్ 2 లో మెయిన్ విలన్ ఎవరో తెలుసా?

S J Surya is the main villain in Kamal Haasan S Shankar Indian 2

Kamal Haasan – Indian 2 : కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తుంది. కమల్ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమాలో తానే కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రలో కనిపించాడు. దీంతో ఆ చిత్రం ఎండింగ్ లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చనిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో విలన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే దాని పై ఎంతో ఆసక్తి నెలకుంది.

Sharwanand – Siddharth : శర్వానంద్ పెళ్లిలో సిద్దార్థ్ మ్యూజికల్ కాన్సర్ట్.. వీడియో వైరల్!

ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, బాబీ సింహా, సముద్రఖని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. వీరిలోనే ఒకరు విలన్ గా కనిపించబోతున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాలో మరో పాత్ర ఉందట. ఆ పాత్రలో నటించబోయే వారే మెయిన్ విలన్ అని తెలుస్తుంది. ఆ నటుడు ఎవరో కాదు ఎస్ జె సూర్య. ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడని తమిళ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా ఎస్ జె సూర్య మాట్లాడుతూ.. తను ఒక బిగ్ ప్రాజెక్ట్ లో విలన్ గా నటిస్తున్నట్లు, మూవీలో అది చాలా సర్‌ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Tamannah: ప్రేమించుకుంటున్నారా..? సిరీస్ కోసమే క‌లిసి ప్ర‌యాణ‌మా..?

ఆ ఇంటర్వ్యూలో ఎస్ జె సూర్య చెప్పిన బిగ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 నే అని కోలీవుడ్ వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియన్ 2 లో సూర్య నటించబోతున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న మరో మూవీ గేమ్ చెంజర్ (Game Changer) లో కూడా ఎస్ జె సూర్య.. నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం.