Sadak -2 Trailer : 8.4m Dislikes..ఫ్యాన్స్ కు ఎందుకంత కోపం

  • Published By: madhu ,Published On : August 14, 2020 / 12:55 PM IST
Sadak -2 Trailer : 8.4m Dislikes..ఫ్యాన్స్ కు ఎందుకంత కోపం

హీరోలను, హీరోయిన్లను అభిమానులు ఆదరిస్తుంటారు. వారికి తిక్కతిరిగితే..అంతే సంగతులు. ఇదే జ జరిగింది Sadak -2 Trailer. ఒక్కటి కాదు..రెండు కాదు..ఏకంగా..8.4m డిస్ లైక్స్ కొట్టేశారు. ఇటీవలే ఈ ఫిల్మ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ వచ్చిరాగానే ఆలస్యం…గంటల వ్యవధిలో Youtube లో ఇప్పటి వరకు 8.4m డిస్ లైక్స్ రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఓ సినిమా ట్రైలర్ కు ఇన్ని సంఖ్యలో డిస్ లైక్స్ ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాలో సడక్ సినిమాలో హీరోగా నటించిన సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, అలియా భట్ తదితరులు నటించారు.

బాబా..బాబా..సంజు బాబా అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే సంజయ్ దత్ ఉన్నా..అందాలు ఆరబోసే అలియా భట్ ఉన్నా…అన్ని డిస్ లైక్స్ ఎందుకు వచ్చాయి ?. సినిమా నచ్చలేదా ? ట్రైలర్ అంత మంచిగా లేదా ? అని అనుకుంటున్నారు. కానీ దీనికి వేరే కారణం ఉంది.

బాలీవుడ్ యంగ్ హీరో..సుశాంత్ ఆత్మహత్య విషయంపై హీరోయిన్ అలియా భట్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అంతేకాదు..మహేష్ భట్ పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. 95 శాతం డిస్ లైక్ లకు వచ్చిన సడక్ – 2 పై దీని ప్రభావం ఎంత వరకు పడుతుందోనని చిత్ర యూనిట్ ఆందోళన పడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే హాట్ స్టార్ అన్ ఇన్ స్టాల్ చేయాలని సుశాంత్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

సుశాంత్ సింగ్..రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. నెపోటిజం (Nepotism) వల్లనే సుశాంత్ ఆత్మహత్య పలువురు ప్రముఖులు, ఫ్యాన్స్, కుటుంబసభ్యుు ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసును కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.