Sai Dharam Tej: వైష్ణవ్ తేజ్‌కు మెగా విషెస్ చెప్పిన సుప్రీం హీరో!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ అన్ని పనులు ముగించుకుని మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ గ్యారెంటీ హిట్ అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Sai Dharam Tej: వైష్ణవ్ తేజ్‌కు మెగా విషెస్ చెప్పిన సుప్రీం హీరో!

Sai Dharam Tej Wishes Vaishnav Tej On Rangaranga Vaibhavanga Release

Sai Dharam Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ అన్ని పనులు ముగించుకుని మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ గ్యారెంటీ హిట్ అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Rangaranga Vaibhavanga Pre-Release Event: రంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు

ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను దర్శకుడు గిరీశాయ తెరకెక్కించారు. కాగా, ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా ట్వీట్ చేశారు. ‘వైషు బాబు.. రేపు రిలీజ్ అవుతున్న నీ సినిమాకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను నువ్వు ఎంత ఇష్టపడి, కష్టపడి చేశావో నాకు తెలుసు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ చిత్ర యూనిట్‌కు విషెస్ తెలిపాడు.

RangaRanga Vaibhavanga Trailer: రంగరంగ వైభవంగా ట్రైలర్.. వైష్ణవ్‌కు హిట్ గ్యారెంటీ అంటోన్న ఫ్యాన్స్!

కాగా, రంగరంగ వైభవంగా సినిమాతో వైష్ణవ్ తేజ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా చూస్తున్నాడు. ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలన్నీ కూడా ఉన్నాయని.. ఆడియెన్స్ ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.