Saif Alikhan : ఇంట్లో ఉంటే పిల్లలు పుడతారని భయమేస్తుంది : సైఫ్ అలీఖాన్

షోలో కపిల్ శర్మ.. సైఫ్ ని ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. మీరు తాండవ్‌, భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2, తర్వాత ఆదిపురుష్ ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారు గ్యాప్ లేకుండా

Saif Alikhan : ఇంట్లో ఉంటే పిల్లలు పుడతారని భయమేస్తుంది : సైఫ్ అలీఖాన్

Saif

Saif Alikhan :  బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా సైఫ్ నటించిన ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ సినిమా ఈ వారం రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు సైఫ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కపిల్‌ శర్మ షోకు వెళ్ళాడు సైఫ్‌. సైఫ్ తో పాటు చిత్రయూనిట్‌ రాణీ ముఖర్జీ, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వానీలు కూడా షోలో పాల్గొన్నారు.

Rashmika : డేటింగ్ చేయడానికి వయసుతో సంబంధం లేదు : రష్మిక

షోలో కపిల్ శర్మ.. సైఫ్ ని ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. మీరు తాండవ్‌, భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2, తర్వాత ఆదిపురుష్ ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారు గ్యాప్ లేకుండా ఎందుకని? మీకు పని అంటే ప్రేమా? లేదంటే రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుందా? అని సైఫ్ ని ప్రశ్నించాడు కపిల్.

Macharla Niyojakavargam : పవన్ కి పోటీగా నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’

దీనికి సైఫ్‌ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంట్లో ఉంటే కరీనా కూడా ఉంటుంది. దీంతో ఇంకా ఎక్కువమమంది పిల్లలు పుట్టేలా ఉన్నారని, ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నానన్నాడు. ఆయన సమాధానం విని కపిల్ సహా అక్కడున్నవాళ్లంతా నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే సైఫ్ ‘ఆదిపురుష్’ షూట్ కంప్లీట్ చేశారు. ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తున్నారు.