Salman, Shahrukh : సల్మాన్ – షారుక్ మల్టీస్టారర్..

సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో పాటు ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్‌తో సినిమా చెయ్యబోతున్నారు షారుఖ్..

Salman, Shahrukh : సల్మాన్ – షారుక్ మల్టీస్టారర్..

Salman Shahrukh

Salman, Shahrukh: బాలీవుడ్ బాద్‌షా తన సినిమాల కన్నా మిగతా హీరోల సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉంటున్నారు. రెండేళ్ల నుంచి సినిమా అనౌన్స్ చెయ్యని ఈ బాలీవుడ్ బాద్‌షా మల్టీస్టారర్స్‌తో మస్త్ బిజీగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో పాటు ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్‌తో సినిమా చెయ్యబోతున్నారు షారుఖ్.

లాంగ్ గ్యాప్ తర్వాత బాద్‌షా ఇప్పుడు ‘పఠాన్’ సినిమాతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి రెడీ అయ్యారు. ఈ సినిమాలో షారుక్ రా ఏజంట్‌గా పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈసారి ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చెయ్యకుండా విజువల్ ట్రీట్‌కు షా రెడీ అవుతూనే మరికొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ‘రాఖీ’ పేరుతో వయా కామ్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న సినిమాలో సంజయ్ దత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు షారుఖ్ ఖాన్.

Suhana Khan : బొమ్మరిల్లు ఫాదర్‌లా కూతురి బాయ్‌ఫ్రెండ్స్ కోసం కింగ్ ఖాన్ కండీషన్స్…

లేటెస్ట్‌గా సిద్దార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న ‘పఠాన్’ సినిమాలో క్రేజీ డ్యుయో షారుఖ్, సల్మాన్‌ని చూడబోతున్నాం. షారుఖ్ నటిస్తున్న ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చెయ్యబోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ ‘టైగర్’ సిరీస్‌లో కూడా షారుఖ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే షారుఖ్, సల్మాన్‌ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి.

ఇక సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సినిమాలతో పాటు ‘లాల్‌’ లో కూడా గెస్ట్ రోల్‌లో మెరవబోతున్నారు షారుఖ్. ఆమిర్ ఖాన్, నాగ చైతన్య, కరీనా కపూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా ‘లాల్ సింగ్ చద్దా’ లో షారూఖ్ క్యామియో అప్పియరెన్స్‌తో ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుష్ చెయ్యబోతున్నారు.