Suhana Khan : బొమ్మరిల్లు ఫాదర్‌లా కూతురి బాయ్‌ఫ్రెండ్స్ కోసం కింగ్ ఖాన్ కండీషన్స్…

ఇదిలా ఉంటే రీసెంట్‌గా షారుఖ్ తన కూతురిని పెళ్ళి చేసుకునే వాడికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ బొమ్మరిల్లు ఫాదర్ టైప్‌లో షారుఖ్ కూడా ఏడు కండీషన్స్ పెట్టాడు..

Suhana Khan : బొమ్మరిల్లు ఫాదర్‌లా కూతురి బాయ్‌ఫ్రెండ్స్ కోసం కింగ్ ఖాన్ కండీషన్స్…

Shahrukh Khan Rules For Daughter Suhana Khan Boy Friends

Updated On : May 27, 2021 / 6:39 PM IST

Suhana Khan: సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు స్టార్ కిడ్స్‌కి ఏ రేంజ్‌ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. జాన్వీ కపూర్, జాకీ ష్రాఫ్ కూతురు క్రిష్ణ ష్రాఫ్, ఆమిర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్.. ఇలా కొంతమంది స్టార్ కిడ్స్ ఇన్‌స్టా‌లో రచ్చ రచ్చ చేస్తుంటారు.. వాళ్ల హాట్ ఫొటోస్ నెట్టింట బీభత్సంగా వైరల్ అవుతుంటాయి..

ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్ అయితే ఇన్‌స్టా‌గ్రామ్‌లో యమా యాక్టివ్‌గా ఉంటుంది.. అమ్మడి ఫొటోలు చూసి కుర్ర కారు సొల్లు కార్చేస్తుంటారు.. కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌లో సుహానా తన 21వ పుట్టినరోజు జరుపుకున్న ఫొటోలు ఇన్‌స్టాలో రచ్చ లేపాయి.. ఇదిలా ఉంటే రీసెంట్‌గా షారుఖ్ తన కూతురిని పెళ్ళి చేసుకునే వాడికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ బొమ్మరిల్లు ఫాదర్ టైప్‌లో.. (ఆ సినిమాలో ఏడు రోజులు జెనీలియాను ఇంట్లో ఉండమని చెప్పినట్టు).. షారుఖ్ కూడా ఏడు కండీషన్స్ పెట్టాడు.. కింగ్ ఖాన్ చెప్పిన క్వాలిటీస్ ఇవే..

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

‘‘1) మంచి జాబ్ ఉండాలి.. 2) నువ్వు నాకు నచ్చవని అర్థం చేసుకో.. 3) నేనెక్కడైనా ఉంటాను.. మర్చిపోకు.. 4) ఎందుకైనా మంచిది, ఒక లాయర్‌ని తెచ్చుకో.. 5) తను నా ప్రిన్సెస్.. నువ్వు తనను రూల్ చెయ్యలేవు… 6) నా కూతురి విషయంలో తేడా చేస్తే నేను జైలుకెళ్లడానికి కూడా ఆలోచించను.. 7) నువ్వు తనకేం చేసినా నీకూ అదే రిపీట్ అవుతుంది.. గుర్తుపెట్టుకో’’.. ఇవీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన కూతురిని పెళ్ళి చేసుకోబోయే వ్యక్తికి పెట్టిన ఈ కండీషన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..