Samantha : యూట్యూబ్ ఛానెళ్లపై దావా అవసరమా..? సమంత పిటిషన్‌పై కోర్టు కీలక కామెంట్స్

సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే... పరువుకు భంగం కలిగింది అనేది కూడా వారే కదా అని కోర్టు కామెంట్ చేసింది.

Samantha : యూట్యూబ్ ఛానెళ్లపై దావా అవసరమా..? సమంత పిటిషన్‌పై కోర్టు కీలక కామెంట్స్

Samantha Defamation Case

తీర్పు రేపటికి వాయిదా

Samantha : హీరోయిన్ సమంత ధాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టు విచారణ జరిపింది. విడిపోవాలని నాగచైతన్య, తాను తీసుకున్న నిర్ణయంపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్ట దావా పిటిషన్ వేసింది సమంత. డాక్టర్ వెంకట్ రావు తో పాటు మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ పైనా పరువు నష్టం దావా వేసింది సమంత. తనకు అక్రమ సంబంధాలు అంటకట్టి… తాను అబార్షన్ చేసుకున్నానంటూ… తన పరువుకి నష్టం కలిగే కలిగించేలా డాక్టర్ వెంకట్ రావు ఇంటర్వ్యూ ఇవ్వడంపై సమంత అభ్యంతరం తెలిపింది. తనకు లేనిపోని ఎఫైర్లు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేసిన వెంకట్ రావుపై డిఫమేషన్ సూట్ వేసింది సమంత. వెంటనే యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా నుంచి ఆ లింకులు డిలీట్ చేయించాలని పిటిషన్ లో పేర్కొంది సమంత. తన విడాకుల గురించి తన గురించి అసత్య ప్రసారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
Read This : Samantha : సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సమంత

ఇవాళ విచారణ సందర్భంగా సమంత పిటిషన్లు త్వరగతిన విచారించాలని కోర్టును ఆమె తరఫు న్యాయవాది బాలాజీ. కోర్టు ముందు సామాన్యులు అయినా.. సెలబ్రిటీలు అయినా ఒక్కటే అని ఈ సందర్భంగా కూకట్ పల్లి కోర్ట్ న్యాయమూర్తి తెలిపారు. సెషన్ చివరలో కేసు విచారిస్తామని లాయర్ కు చెప్పారు.

సాయంత్రం సమంత పరువు నష్టం పిటిషన్ పై వాదనలు జరిగాయి. సమంత ప్రతిష్ఠను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు. ఐతే… తప్పు జరిగిందని భావిస్తే…. పరువునష్టం దాఖలు చేసే బదులు, వారి నుండి క్షమాపణలు కోరొచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది కూడా వారే కదా అని కోర్టు కామెంట్ చేసింది.

Read This : Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్??

సమంత ఇంకా విడాకులు తీసుకోలేదనీ… ఆ లోగానే ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమన్నారు న్యాయవాది బాలాజీ. సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారని.. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా …పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్ట్‌ను కోరారు సమంత తరఫు న్యాయవాది. ఈ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఐతే.. కీలక కామెంట్లు చేసిన కోర్టు.. తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తీర్పును రేపు శుక్రవారం ప్రకటిస్తామని తెలిపింది.