Samantha : సోషల్ మీడియాలో మరో రికార్డ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన సమంత..

సమంత సోషల్ మీడియాలో మిగతా హీరోయిన్స్ కంటే కూడా చాలా యాక్టీవ్ గ ఉంటుంది. విడాకుల తర్వాత సమంత ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతుంది. తనకి సంబందించిన ప్రతి విషయంతో.......

Samantha : సోషల్ మీడియాలో మరో రికార్డ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన సమంత..

Sam

Samantha :  సౌత్ టాప్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. తన సినిమాలతోనే కాక తన సేవా కార్యక్రమాలతో కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత సినిమాల్లో వేగం తగ్గించినా ఇటీవల చైతుతో విడాకులు అవ్వడంతో మళ్ళీ తన జోరు పెంచింది. ఇప్పటికే సమంత చేతిలో దాదాపు 5 సినిమాలు ఉన్నాయి. అందులో హాలీవుడ్ సినిమా కూడా ఉంది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఒప్పుకుంది. దీంతో సమంతకి ఫ్యాన్ ఫాలోయింగ్ మళ్ళీ పెరుగుతున్నారు.

Bigg Boss 5 : మళ్ళీ హగ్గులంటూ మొదలుపెట్టిన సిరి.. ఇవ్వాలా వద్దా అని షణ్ముఖ్‌

సమంత సోషల్ మీడియాలో మిగతా హీరోయిన్స్ కంటే కూడా చాలా యాక్టీవ్ గ ఉంటుంది. విడాకుల తర్వాత సమంత ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతుంది. తనకి సంబందించిన ప్రతి విషయంతో పాటు, రోజూ కొటేషన్స్ పెడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది సామ్. దీంతో సమంతని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది.

Anand Devarakonda : సైకోగా ఆనంద్ దేవరకొండ.. బాలీవుడ్ స్టార్లతో కలిసి కొత్త ప్రయోగం

నిన్నటితో సమంతని ఇంస్టాగ్రామ్ కి 20 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. దీంతో మరో అరుదైన రికార్డు అందుకుంది సమంత. దాదాపు 2 కోట్ల మంది సమంతను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. నిన్నటితో ఈ రికార్డు సాధించినందుకు సమంత తన అభిమానులకు, తనని ఫాలో అయ్యే వాళ్లకు థ్యాంక్స్ చెప్తూ ఓ స్టోరీ పెట్టింది. సమంత సోషల్ మీడియాలో ఈ రికార్డు సాధించడంతో ఆమె అభిమానులు ఆనందపడుతూ సమంతకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.