సమంత బ్రౌన్‌రైస్‌తో ఏం చేసిందో చూడండి..

  • Published By: sekhar ,Published On : September 27, 2020 / 11:30 AM IST
సమంత బ్రౌన్‌రైస్‌తో ఏం చేసిందో చూడండి..

Samantha – Upasana: ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి ఉపాసన కొణిదెల యువర్‌ లైఫ్‌ డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పాఠకులకు ఆరోగ్యసూత్రాలతో పాటు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. ఈ వెబ్‌సైట్‌కు సమంత అక్కినేని గెస్ట్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నట్లు ఇటీవల ఉపాసన తెలియజేశారు. తన వర్క్‌లో భాగంగా సమంత టమాటో రైస్‌ తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆదివారం విడుదల చేశారు.


ఉపాసన కొణిదెల, సమంత అక్కినేని వంట కార్యక్రమంలో పాల్గొన్నారు. సమంత బ్రౌన్‌ రైస్‌తో టమాటో రైస్‌ ఎలా తయారు చేయాలో తెలియజేశారు. తాను ప్రతిరోజూ రైస్‌ తింటానని, అయితే వైట్‌ రైస్‌ తిననని చెప్పిన సమంత బ్రౌన్‌ రైస్‌ను మాత్రమే తీసుకుంటానని చెప్పారు. బ్రౌన్‌ రైస్‌తో టమాటో రైస్‌ తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మెగా అండ్ అక్కినేని కోడళ్లు తమిళ్‌లోనే మాట్లాడుకోవడం విశేషం. ఉపాసన తమిళ్ మాట్లాడడం చూసి, మీ తమిళ్ మా అమ్మ మాట్లాడే తమిళ్‌లాగే ఉందని సమంత అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.