Shaakuntalam: శాకుంతలం.. మళ్లీ వెనకడుగు వేసిందిగా..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, తన హోం బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించగా, ఇప్పుడు మరోసారి ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Shaakuntalam: శాకుంతలం.. మళ్లీ వెనకడుగు వేసిందిగా..!

Samantha Shaakuntalam Release Postponed Again

Shaakuntalam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, తన హోం బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Shaakuntalam: ‘శాకుంతలం’ను భారీగా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?

అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. రీసెంట్‌గా ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించడంతో, ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ వెనకడుగు వేయదని అందరూ అనుకున్నారు.

Shaakuntalam: ఎట్టకేలకు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

కానీ, మరోసారి ప్రేక్షకులకు శాకుంతలం చిత్ర యూనిట్ ఝలక్ ఇచ్చింది. ఈ సినిమాను 3Dలోనూ రిలీజ్ చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అనుభూతిని అందరూ అందుకునేందుకే మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మళ్లీ వెనకడుగు వేసింది. అయితే ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేస్తారా లేక ఇలా వరుసగా వాయిదా వేస్తూ కాలం గడిపేస్తారా అంటూ అభిమానులు గుణశేఖర్ అండ్ టీమ్‌పై ఫైర్ అవుతున్నారు. సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.