Santosh Shobhan : లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ ట్రైలర్ రిలీజ్.. కామెడీ అనుకున్నాం, యాక్షన్ కూడా ఓ రేంజ్‌లో ఉందిగా..

టీజర్ చూసి ఇన్నాళ్లు ఈ 'లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్' సినిమా కామెడీ సినిమా అనుకున్నారు అంతా. కానీ ట్రైలర్ లో కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చూపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. 'లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్' ట్రైలర్ లోనే............

Santosh Shobhan : లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ ట్రైలర్ రిలీజ్.. కామెడీ అనుకున్నాం, యాక్షన్ కూడా ఓ రేంజ్‌లో ఉందిగా..

Santosh Shobhan like share subscribe movie trailer released

Santosh Shobhan :  సంతోష్ శోభన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్’. నవంబర్ 4న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

టీజర్ చూసి ఇన్నాళ్లు ఈ ‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్’ సినిమా కామెడీ సినిమా అనుకున్నారు అంతా. కానీ ట్రైలర్ లో కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చూపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్’ ట్రైలర్ లోనే సినిమా కథని అంతర్లీనంగా చూపించేశారు. హీరో ఒక ట్రావెల్ వ్లాగర్. ఒక ఊరికి వ్లాగ్ చేయడానికి వెళ్తే అక్కడ ట్రావెల్ లో ఫరియా కనిపిస్తుంది. ఫరియాని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తుంటే అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటారు. మావోయిస్టులు వీరిని, పోలీసులు మావోయిస్టులని తరుముతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. ఇంత యాక్షన్ సీన్స్ లో కూడా అక్కడక్కడా కామెడీ సీన్స్ ని దర్శకుడు కరెక్ట్ గా పెట్టాడు అని అర్ధమవుతుంది.

Pragathi : ఆంటీ అంటే నేను కూడా ఊరుకోను.. నేను అందగత్తెనే.. జిమ్ చేసేది అందం కోసం కాదు..

ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఫరియా, సంతోష్ శోభన్ మధ్య మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉండబోతోంది. ఇక ఈ ట్రైలర్ ని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. త్వరలో మరిన్ని ప్రమోషన్స్ చేయనున్నారు చిత్ర యూనిట్. ఏక్ మినీ కథా, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో మంచి విజయం అందుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి.