Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ ట్రీట్‌గా మే 12న ప్రపంవచ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ ట్రీట్‌గా మే 12న ప్రపంవచ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా, ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. ఇక చాలా రోజుల తరువాత మహేష్ నుండి బోల్డ్ డైలాగులు కూడా ఈ సినిమాలో వినిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

Sarkaru Vaari Paata: సర్‌ప్రైజ్ ఇస్తోన్న సర్కారు వారి పాట.. ఏమిటంటే?

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా మంచి టాక్‌ను తెచ్చుకుని సూపర్ హిట్ బొమ్మగా నిలిచింది. ఇక ఇటీవల ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘనత సాధించింది. సర్కారు వారి పాట రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకుంది.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇటీవల కాలంలో 50 రోజులు సినిమా ఆడటం గగనమే అని చెప్పాలి. కానీ కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఖాయమని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ పాత్రకు అభిమానులు ఫిదా కాగా, ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.