Shiva Krishna : రానా నాయుడు సిరీస్ ఓ బ్లూ ఫిలిం.. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలి.. సీనియర్ నటుడు వ్యాఖ్యలు..

ఈ సిరీస్ తీసిన వాళ్లపై, సిరీస్ పై దారుణంగా అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ శివకృష్ణ రానా నాయిడు సిరీస్ పై విమర్శలు చేశారు......................

Shiva Krishna : రానా నాయుడు సిరీస్ ఓ బ్లూ ఫిలిం.. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలి.. సీనియర్ నటుడు వ్యాఖ్యలు..

Senior Actor Shiva Krishna sensational comments on Rana Naidu series

Shiva Krishna :  దగ్గుబాటి బాబాయ్ – అబ్బాయిలు వెంకటేష్-రానా కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కిన రానా నాయుడు సిరీస్ మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందే రిలీజ్ చేసిన ట్రైలర్, వెంకటేష్ -రానా కలిసి నటిస్తుండటంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూసి ఇది తండ్రి, కొడుకుల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ లా సీరియస్ గా ఉండే సిరీస్ అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత ఈ సిరీస్ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ అడల్ట్, బోల్డ్ కంటెంట్, వల్గర్ లాంగ్వేజ్ ఉండటమే కారణం. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కావడంతో చాలా మంది ఈ సిరీస్ ను చూశారు. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో బూతులు, బోల్డ్ కంటెంట్ ఉంటుందని తెలిసిందే కానీ తెలుగు హీరోలని తీసుకొని ఈ రేంజ్ లో అడల్ట్ కంటెంట్ పెట్టి తీయడంతో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

దీంతో ఈ సిరీస్ తీసిన వాళ్లపై, సిరీస్ పై దారుణంగా అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ శివకృష్ణ.. రానా నాయిడు సిరీస్ పై విమర్శలు చేశారు.

RGV : శివ సినిమా క్లైమాక్స్ ఆ బిల్డింగ్ పైనే షూట్ చేశాను.. స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

శివకృష్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రానా నాయిడు సిరీస్ నిన్నే చూశాను. అది ఆల్మోస్ట్ బ్లూ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో అంత దారుణమైన కంటెంట్ చూడలేదు. అందులో కొన్ని సీన్స్ అయితే మరీ దారుణం. భార్య, భర్తలు బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు పిల్లలు చూడటమేంటి. దేశం ఆర్ధికంగా పతనమైనా కోలుకుంటుంది. కానీ సంసృతి పరంగా పతనమైతే కోలుకోలేదు. సినిమాల్లో బూతులు, అడల్ట్ కంటెంట్ ఉంటే థియేటర్స్ కి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. అదే వెబ్ సిరీస్ లు అలా కాదు. ఇంట్లో అందరూ చూసేవి. ఈ మధ్య సిరీస్ లలో అందరూ ఇలాంటి కంటెంట్ ఎక్కువగా పెడుతున్నారు. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాల్ససిందే అని వ్యాఖ్యానించారు.