Sumalatha : సీనియర్‌ నటి సుమలత కొడుకు పెళ్లి.. వెంకయ్య నాయుడుతో రజనీకాంత్‌, యశ్..

సీనియర్ నటి సుమలత, స్వర్గీయ అంబరీష్‌ల ఏకైక కుమారుడి అభిషేక్ పెళ్లి నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వెంకయ్య నాయుడుతో రజనీకాంత్‌, మోహన్‌బాబు, యశ్ హాజరయ్యి..

Sumalatha : సీనియర్‌ నటి సుమలత కొడుకు పెళ్లి.. వెంకయ్య నాయుడుతో రజనీకాంత్‌, యశ్..

Senior actress and karnataka mp Sumalatha son Abishek Ambareesh wedding

Sumalatha : సీనియర్ నటి సుమలత సౌత్ టు నార్త్ పలు భాషల్లో 220కి పైగా సినిమాలో నటించి అలరించారు. ముఖ్యంగా తెలుగు, మలయాళ సినిమాలతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ తో కలిసి వర్క్ చేసిన సుమలత ప్రస్తుతం ప్రజాసేవలో నిమగ్నమయ్యి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కర్ణాటక లోక్ సభ ఎంపీగా రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్నారు. కాగా సుమలత, స్వర్గీయ అంబరీష్‌కి (Ambareesh) అభిషేక్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా అతని పెళ్లిని ఘనంగా చేశారు సుమలత.

Tillu Square : డీజే టిల్లు సౌండ్‌కి డేట్ షురూ.. పోస్టర్‌లో అనుపమతో సిద్దు రొమాన్స్!

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ప్రసాద్‌ బిదపా కూతురు అవివాతో ఈరోజు (జూన్ 5) ఉదయం అభిషేక్‌ ఏడడుగులు వేశాడు. బెంగళూరులోని ఒక ప్రముఖ ప్యాలెస్‌ లో వీరి వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) హాజరయ్యి నూతన వధువరులను ఆశీర్వదించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఎంపీ రఘురామరాజు కూడా హాజరయ్యి అభిషేక్‌ అండ్ అవివాని దీవించారు.

Senior actress and karnataka mp Sumalatha son Abishek Ambareesh wedding

Senior actress and karnataka mp Sumalatha son Abishek Ambareesh wedding

ఇక సినీ పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu), కేజీఎఫ్ స్టార్ యశ్ (Yash) హాజరయ్యి నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సుమలత భర్త అంబరీష్ 2018 లో చనిపోయిన విషయం తెలిసిందే. అంబరీష్ కూడా సినిమా, రాజకీయ రంగంలో పని చేశారు. తెలుగు ఆడియన్స్ కి చిరంజీవి మంజునాథ్ సినిమాతో పరిచయమయ్యారు.