Lahari : శంషాబాద్ వద్ద యాక్సిడెంట్.. కార్‌తో బైక్‌ని ఢీ కొట్టిన సీరియల్ నటి

నిన్న రాత్రి శంషాబాద్ లో తన షూటింగ్ ముగించుకొని కారులో ఇంటికి బయల్దేరింది లహరి. లహరినే సొంతంగా డ్రైవ్ చేస్తుంది. దారిలో ఓ బైక్ ను తప్పించబోయి ఢీ కొట్టింది. దీంతో బైక్.......

Lahari :  శంషాబాద్ వద్ద యాక్సిడెంట్.. కార్‌తో బైక్‌ని ఢీ కొట్టిన సీరియల్ నటి

Lahari

Lahari :  బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ తో అలరించిన లహరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మొగలి రేకులు’ సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న లహరి ఆ తర్వాత చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా కొన్ని సీరియల్స్ తో పాటు యూట్యూబ్ లోను వీడియోలు చేస్తుంది. తాజాగా ఓ యాక్సిడెంట్ తో లహరి వార్తల్లో నిలిచింది.

Jahnvi Kapoor : అలాంటి బట్టలు వేసుకోవడం.. ఇబ్బంది పడటం ఎందుకు?.. జాన్వీపై నెటిజన్స్ ట్రోల్..

 

నిన్న రాత్రి శంషాబాద్ లో తన షూటింగ్ ముగించుకొని కారులో ఇంటికి బయల్దేరింది లహరి. లహరినే సొంతంగా డ్రైవ్ చేస్తుంది. దారిలో ఓ బైక్ ను తప్పించబోయి ఢీ కొట్టింది. దీంతో బైక్ ను నడుపుతున్న వ్యక్తి కిందపడ్డాడు. అతనికి గాయాలయ్యాయి. అక్కడ జరిగిన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అతడ్ని దగ్గర్లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

Bigg Boss Priyanka : ప్రియాంకపై ప్రశంసలు కురిపించిన నాగబాబు

ప్రమాదం జరిగిన తర్వాత కారు చుట్టూ జనాలు గుమిగూడేసరికి లహరి భయపడి కిందికి దిగలేదు. ఈ లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు లహరిని తన కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు కూడా చేశారు. అయితే ఆమె మద్యం సేవించలేదని తేలింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కావడంతో పాటు ఆ వ్యక్తికి ప్రాణాపాయం లేదని తెలియడంతో ల‌హ‌రితో మాట్లాడి ఆమె కుటుంబ సభ్యులు వచ్చాక జాగ్రత్తగా నడపమని హెచ్చరించి పంపించేసినట్లు సమాచారం.