‘క‌బీర్ సింగ్’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 10:05 AM IST
‘క‌బీర్ సింగ్’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అర్జున్ రెడ్డి సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నా సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి  ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. షాహిద్ క‌పూర్ హీరో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు బాగా పెంచేసింది. ఇక  మే 13న క‌బీర్ సింగ్ ట్రైల‌ర్ విడుద‌ల‌ కానుంది. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఈ సినిమా జూన్ 21న విడుద‌ల కానుంది. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో మ‌రింత రా మెటీరియ‌ల్ సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్. ఇక్కడ తీయ‌లేక‌పోయిన స‌న్నివేశాలు కూడా హిందీలో తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఒరిజిన‌ల్ ఫీల్ పోకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు తీస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. షాహిద్ క‌పూర్ కూడా పూర్తిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇమిటేట్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. మ‌రి తెలుగులో అదరగొట్టిన ఈ సినిమా హిందీలో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాలి.