Sharukh Khan: ఈజిప్ట్ అభిమానికి ఆటోగ్రాఫ్ ఫోటోలు పంపిన షారుఖ్ ఖాన్

ఈజిప్ట్ కు చెందిన షారుఖ్ ఖాన్ అభిమాని గుర్తున్నాడా?. తన ఆరాధ్య నటుడు షారుఖ్ ఖాన్ నుంచి నేరుగా ఉత్తరం, మరియు స్వీయ సంతకం కలిగిన ఫోటోలను అందుకున్నాడు ఆ అభిమాని.

Sharukh Khan: ఈజిప్ట్ అభిమానికి ఆటోగ్రాఫ్ ఫోటోలు పంపిన షారుఖ్ ఖాన్

Srk

Sharukh Khan: ఈజిప్ట్ కు చెందిన షారుఖ్ ఖాన్ అభిమాని గుర్తున్నాడా?. ఈజిప్ట్ లో ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తున్న అతను.. భారత పర్యాటకురాలు అశ్విని దేశ్ పాండే వద్ద ముందస్తుగా డబ్బులు తీసుకోకుండా విమాన టికెట్లు బుక్ చేశాడు. బాలీవుడ్ బాద్షాకు వీరాభిమాని అయిన ఆ ట్రావెల్ ఏజెంట్(పేరును గోప్యంగా ఉంచారు).. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తన ఆరాధ్య నటుడు షారుఖ్ ఖాన్ నుంచి నేరుగా ఉత్తరం, మరియు స్వీయ సంతకం కలిగిన ఫోటోలను అందుకున్నాడు ఆ అభిమాని. ఈ విషయాన్ని పర్యాటకురాలు అశ్విని దేశ్ పాండే మరోసారి ట్విటర్ లో పంచుకున్నారు.

Also read: India-Germany: పుతిన్ ను సమర్ధించిన జర్మన్ నేవీ చీఫ్ “రాజీనామా”

భారత్ లో నివసిస్తున్న అశ్విని దేశ్ పాండే తన భర్తతో కలిసి ఈజిప్ట్ పర్యాటనకు వెళ్లేందుకు డిసెంబర్ చివరి వారంలో ఈజిప్ట్ లోని ఒక ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించింది. కొన్ని సాంకేతిక కారణాల వలన విమాన టికెట్ డబ్బును అశ్విని ట్రాన్స్ఫర్ చేయలేకపోయింది. దీంతో టికెట్ క్యాన్సిల్ చేయమంటూ సూచించింది. అయితే అందుకు ప్రతిగా సదరు ట్రావెల్ ఏజెంట్ స్పందిస్తూ.. “మీరు షారుఖ్ ఖాన్ నివసిస్తున్న దేశం నుంచి వస్తున్నారు. మీ దేశంపై నమ్మకం ఉంది. మరె ఇతర దేశస్తులైనా ఇలా చేసేవాడిని కాదేమో. కానీ షారుఖ్ కోసం ఏదైనా చేస్తా” అంటూ ఆమెకు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన అశ్విని.. షారుఖ్ ఖాన్ అంటే విదేశాల్లో ఎంత క్రేజ్ ఉందో చూడండి అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో సునామి సృష్టించింది.

Also read: Corona Vaccine: కోవిడ్ వాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఆ అభిమాని గురించి తెలుసుకున్న షారుఖ్.. తానే స్వయంగా ఒక ఉత్తరం రాశాడు. “తోటి భారతీయురాలికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు ఎంతో మంచి మనుసున్న వారు. మీలాంటి మనసున్న వారు ఇంకా రావాలి” అంటూ స్వయంగా సంతకం చేసిన ఉత్తరాన్ని, ఫోటోలను షారుఖ్ ఆ అభిమానికి పంపించాడు. ఇక స్వయంగా షారుఖ్ నుంచి ఆ ఉత్తరాలను, ఫోటోలను అందుకున్న ఆ అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు.

Also read: Corona New Zealand: మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్న న్యూజిలాండ్ మహిళా ప్రధాని